E-Paper
Advertisement

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ
Advertisement

Hockey Sports Documentary: హాకీ టీమ్‌లో చోటు సంపాదించడమే ఆ యువ ఆటగాళ్ల ముందున్న మొదటి ఛాలెంజ్… అక్కడ నిలదొక్కుకుని పెద్ద ప్లేయర్లుగా ఎదగడం మరో యుద్ధం. టీనేజ్‌లోనే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, గెలుపు కోసం ప్రెషర్‌ను తట్టుకుంటూ, తమ కలలను నిజం చేసుకునేందుకు వాళ్లు చేసే పోరాటం అంతా ఇంతా కాదు. ఒక్క మ్యాచ్‌ లో చూపించే పర్ఫార్మెన్స్‌ వాళ్ల కెరీర్‌ నే మార్చేయొచ్చు. మరి హాకీ ప్లే గ్రౌండ్ లో యువ ఆటగాళ్లు ఎదుర్కొనే అసలైన సవాళ్లు ఏంటి ? ఇదే ప్రయాణాన్ని కళ్లకు కట్టే స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ సిరీస్‌ ‘హోమ్‌టౌన్‌ జెయింట్స్‌’ (Hometown Giants). మరి ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడొచ్చు అంటే…

కథలోకి వెళ్తే…

ఈ డాక్యుమెంటరీ కెనడాకు చెందిన వాంకూవర్ జెయింట్స్ (Vancouver Giants) జూనియర్ హాకీ టీమ్ ప్రయాణాన్ని చూపిస్తుంది. 2007 తర్వాత మళ్లీ ఛాంపియన్‌షిప్ గెలవని ఈ టీమ్‌ ను తిరిగి విజయాల బాట పట్టించాలని దాని యజమానులు మైఖేల్ బుబ్లే (Michael Bublé), డ్రూ స్కాట్ (Drew Scott) టార్గెట్ పెట్టుకుంటారు. అయితే టీమ్‌ను విజయవంతంగా నడిపించడం అంత ఈజీ కాదు. ప్లేయర్ల టాలెంట్, కోచ్‌ల వ్యూహాలు, కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలు… ఇలా ప్రతి అంశం జట్టు భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.

Advertisement

ట్రైనింగ్ క్యాంప్ మొదలైనప్పటి నుంచే ప్లేయర్ల మధ్య పోటీ మొదలవుతుంది. టీమ్‌లో స్థానం సంపాదించేందుకు ప్రతి ఒక్కరూ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవాలి. వీరిలో చాలామంది టీనేజ్ వయసులోనే ఉంటారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చదువును కొనసాగిస్తూనే, ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్లుగా ఎదగాలని కలలు కంటున్నారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా అందరికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు వస్తాయనే గ్యారంటీ లేదు.

కొత్త కోచ్ పార్కర్ బర్గెస్ (Parker Burgess), జనరల్ మేనేజర్ హ్నాట్ డొమెనిచెల్లి (Hnat Domenichelli) బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్‌పై అంచనాలు మరింత పెరుగుతాయి. 17 ఏళ్ల రయాన్ లిన్ (Ryan Lin)పై ఎన్‌హెచ్‌ఎల్ డ్రాఫ్ట్‌లో ఎంపికయ్యే అంచనాలు ఉండగా, 19 ఏళ్ల లియోనార్డో డొమెనిచెల్లి (Leonardo Domenichelli) తన ఆటతోనే టీమ్‌లో స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాడు.

Advertisement

సీజన్ ముందుకు సాగేకొద్దీ ప్లేయర్లపై ప్రెషర్ పెరుగుతుంది. టీమ్ విజయాల కోసం మార్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అభిమానులకు ఇష్టమైన ఆటగాళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవైపు వ్యక్తిగత కలలు, మరోవైపు టీమ్ అవసరాలు… ఈ రెండింటి మధ్య తీసుకునే నిర్ణయాలు ప్లేయర్ల కెరీర్‌ ను ఎలా మార్చేస్తాయో ఈ సిరీస్ చూపిస్తుంది. మైదానంలో కనిపించే ఆటతో పాటు, తెరవెనుక జరిగే సంఘర్షణలు, ఆటగాళ్ల భావోద్వేగాలను కూడా ఇందులో చూడొచ్చు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్

‘హోమ్‌టౌన్ జెయింట్స్’ అక్టోబర్ 16 నుంచి ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్‌లో యువ ఆటగాళ్ల కష్టం, టీమ్‌లో చోటు కోసం జరిగే పోటీ, హాకీ ప్రపంచంలోని ఒత్తిడిని చూపించారు. స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారితో పాటు, ఆటగాళ్ల కెరీర్ వెనుక ఉండే కష్టం, ఎమోషన్స్ తెలుసుకోవాలని అనుకునే వారికి ఈ సిరీస్ నచ్చొచ్చు.

Read Also: కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

Related News

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

Big Stories

Advertisement
×