TDP Candidate List: 22 మంది అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మచిలీపట్నం మేయర్ అభ్యర్థితో పాటు 21 మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులతో లిస్టు విడుదల చేశారు. రెండో లిస్టులోని 22 మందిలో 82% అంటే 18 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 22 మందిలో 16 మంది అంటే 73% బిసి, ఎస్సీ లేదా మైనారిటీ వర్గాలకు చెందినవారున్నారు. 6 గురు బిసి, 5 గురు ఎస్సీ, 5 గురు మైనారిటీలకు అంకాశం కల్పించారు.
రెండో లిస్టులో 5 మంది ముస్లిం అభ్యర్థులు. మచిలీపట్నం, నాయుడుపేట, నందికొట్కూరు, కదిరి, ఆకివీడు ముస్లిం అభ్యర్థులు వీరిలో నలుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఆరుగురు అభ్యర్థుల వయస్సు 30 లేదా అంతకంటే తక్కువ. సగటు వయస్సు 45.9 సంవత్సరాలుగా ఉన్నారు. 18 మందిలో సగం మంది గ్రాడ్యుయేట్లు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లు మొత్తం రెండు జాబితాలు కలిపి తెలుగుదేశం నుంచి 58 మంది అభ్యర్థులు ప్రకటించారు.
58 మందిలో 37 మంది అంటే 64% మహిళలు 58 మందిలో 38 మంది అంటే 66% బిసి, ఎస్సీ, ఎస్టీ లేదా మైనారిటీ వర్గాలవారు. బిసి 22, ఓసి 20, ఎస్సీ 8, మైనారిటీ 7, ఎస్టీ 1. 58 మందిలో 18 మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు 10 మంది వయస్సు 35 లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్నవాళ్లున్నారు. 34 మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు వీరిలో ఉన్నారు.
Also read: డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!