E-Paper
Advertisement

Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న సిరీస్ లు ఇవే… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే

Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న సిరీస్ లు ఇవే… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే
Advertisement

Hollywood OTT Releases : ఓటీటీలో మంచి కంటెంట్ కోసం చూస్తుంటే, ఇప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ల పై ఓ లుక్ వేయండి. వీకెండ్ కి ఆయితే ఫుల్ ఎంజాయ్ చేయడానికి అదిరిపోయే కంటెంట్ కూడా రెడీగా ఉంది. ఒక్క సారి చూస్తే ఇక ఆపకుండా చూస్తూనే ఉంటారు. వీటి పేర్లు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయి ? అనే వివరాలు తెలుసుకుందాం.

1. 56 డేస్ (56 Days)

ఇదొక పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. లాక్‌డౌన్ టైంలో కొత్తగా పరిచయమైన ఒక జంట, కేవలం రెండు వారాలకే కలిసి ఉండాలని ఫిక్స్ అవుతారు. కానీ సీన్ కట్ చేస్తే… 56 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ బాడీ ఎవరిది? అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఇది 2026 ఫిబ్రవరి 18 నుంచి Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

2. బీయింగ్ గోర్డాన్ రామ్సే (Being Gordon Ramsay)

Advertisement

వరల్డ్ ఫేమస్ షెఫ్ గోర్డాన్ రామ్సే అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయన కోపం, అరుపులు. కానీ ఈ డాక్యుమెంటరీలో ఆయన ఫ్యామిలీ మ్యాన్‌గా ఎలా ఉంటారు? ఆరుగురు పిల్లల తండ్రిగా ఆయన లైఫ్ ఏంటి? అనేది చాలా దగ్గరగా చూడొచ్చు. ఇది ఫిబ్రవరి 18 నుంచి Netflix లో స్ట్రీమ్ అవుతుంది.

3. ది నైట్ ఏజెంట్ – సీజన్ 3 (The Night Agent Season 3)

యాక్షన్ సినిమాల ప్రియులకు ఈ సిరీస్ ను చూస్తే పండగ చేసుకుంటారు. గన్ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ తో అదిరిపోయే ఈ సిరీస్ ఇప్పుడు మూడవ సీజన్ తో వచ్చేసింది. పీటర్ సదర్లాండ్ కొత్త మిషన్ ఏంటి? ఈసారి తను ఎదుర్కోబోయే విలన్స్ ఎవరు? అనే ఉత్కంఠతో సాగుతుంది. ఇది ఫిబ్రవరి 19 నుంచి Netflix ఓటీటీలో చూడొచ్చు.

4. ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ – సీజన్ 2 (The Last Thing He Told Me Season 2)

Advertisement

మిస్టరీథ్రిల్లర్ ని ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. మొదటి సీజన్ ముగిసిన ఐదేళ్ల తర్వాత కథ మళ్ళీ మొదలవుతుంది. ఓవెన్ గతం హన్నాను మళ్ళీ చిక్కుల్లో పడేస్తుంది. ఈసారి వచ్చే ట్విస్టులు మాత్రం ఊహకందని విధంగా ఉంటాయి. దీనిని ఫిబ్రవరి 20 నుంచి Apple TV+ లో చూడొచ్చు.

Read Also :  పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×