India vs Netherlands: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ వర్సెస్ టీమిండియా ( India vs Netherlands ) మధ్య 36వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad) నిర్వహించనున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్న ఆదివారం కొలంబోలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గెలిచిన అనంతరం వెంటనే అహ్మదాబాద్ వచ్చేసింది టీం ఇండియా. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పసికూన నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది సూర్య కుమార్ యాదవ్ సేన.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య నేడు పోరు జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆరున్నరకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఇవాల్టి మ్యాచ్ ఇండియాకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అయినప్పటికీ ప్రయోగాలు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇషాన్ కిషన్ కు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చి, సూపర్ 8 లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇషాన్ కిషన్ స్థానంలో సంజు శాంసన్ స్థానం దక్కించుకుంటాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ 8 లోకి ( Super 8 stage) వెళ్లి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నమీబియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. కొలంబో వేదికగా జరుగునున్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే సూపర్ 8 లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం యూఎస్ఏ జట్టుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటు నెదర్లాండ్స్ జట్టుకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇవాళ జరిగే ఇండియా మ్యాచ్ లో నెదర్లాండ్స్ భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో నమీబియా పైన పాకిస్తాన్ ఓడిపోవాలి. అమెరికా కంటే రన్ రేట్ ఎక్కువ సంపాదిస్తే ఖచ్చితంగా నెదర్లాండ్స్ కు కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది అసాధ్యమని అంటున్నారు.
India ప్లేయింగ్ XI అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
Also Read: IND VS PAK: ఇక పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెలవడం చేతకాక, చివరకు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర
An additional practice session for the Indian team at the Narendra Modi Stadium ahead of their final group stage fixture against Netherlands 🏏
📸: JioHotstar #IndianCricket #T20WC2026 #INDvsNED #Insidesport #CricketTwitter pic.twitter.com/58Zj2DvkIH
— InsideSport (@InsideSportIND) February 17, 2026