E-Paper
Advertisement

Horror Action Thriller OTT : ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు… గోల్డెన్ గ్లోబ్ కూడా ఫిదా… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

Horror Action Thriller OTT : ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు… గోల్డెన్ గ్లోబ్ కూడా ఫిదా… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ
Advertisement

Horror Action Thriller OTT : ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో రికార్డ్ బ్రేక్ చేసిన మూవీ ‘సిన్నర్స్’ (Sinners). మైఖేల్ బి. జోర్డాన్ డబుల్ రోల్‌లో నటించిన ఈ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ఆల్ టైమ్ రికార్డ్‌గా 16 ఆస్కార్ నామినేషన్లు సాధించింది. ఇంతకు ముందు ‘All About Eve’, ‘Titanic’, ‘La La Land’ లాంటివి 14 నామినేషన్లతో ఉండేవి. ఇప్పుడు ఈ సినిమా వాటిని కూడా అధిగమించింది. అంతేకాకుండా $90 మిలియన్ల బడ్జెట్ తో $368 మిలియన్ గ్లోబల్ కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. 2 గంటల 17 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా చూపు తిప్పుకోనివ్వదు. ఇక 2026 మార్చి 15 నుంచి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. వీటిలో ఈ సినిమా ఎన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో ‘సిన్నర్స్’ తెరకెక్కింది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ దీనిని 2025న ఏప్రిల్ 18న యునైటెడ్ స్టేట్స్‌ థియేటర్లలో విడుదల చేసింది. ఈ అమెరికన్ హర్రర్ చిత్రంలో మైఖేల్ బి. జోర్డాన్ క్రిమినల్ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో హైలీ స్టెయిన్‌ఫెల్డ్, మైల్స్ కాటన్, జాక్ ఓ’కానెల్, వున్మి మొసాకు, జేమ్ లాసన్, ఒమర్ మిల్లర్, డెల్రాయ్ లిండోలు కలిసి నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, JioHotstarలో 2025 సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1932లో అమెరికాలోని మిసిసిపీ డెల్టా ప్రాంతంలో జరుగుతుంది. ఆ కాలంలో జాతి వివక్ష ఎక్కువగా ఉండేది. ఎలిజా “స్మోక్” మూర్, ఎలియాస్ “స్టాక్” మూర్ అనే కవల సోదరులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని, ఆ తర్వాత చికాగోలో అక్రమ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుతో తమ సొంత ఊరికి తిరిగి వస్తారు. వాళ్ళు తమ గత నేర చరిత్రను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని భావిస్తారు. ఊరి బయట ఉన్న ఒక పాత సామిల్‌ను కొనుగోలు చేసి, దానిని ఒక ‘జ్యూక్ జాయింట్’ (పాటలు పాడుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఆనందించే క్లబ్) గా మారుస్తారు. ఒక రోజు రాత్రి అక్కడ అద్భుతమైన సంగీతాన్ని ప్లే చేయడంతో ఆ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన వాంపైర్లు బయటకి వస్తాయి. ఒకవైపు క్రూరమైన వాంపైర్లు, మరోవైపు ఆ ప్రాంతంలోని జాతి వివక్ష చూపే వ్యక్తుల నుండి ఈ సోదరులిద్దరూ తమ కుటుంబాన్ని, ఊరి ప్రజలను ఎలా కాపాడుకున్నారనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also :  పర్సు ఖాళీ… ఉండడానికి ఇల్లు లేదు… ఇది సినిమా కాదు ఒక ఎమోషన్

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×