E-Paper
Advertisement

Horror Web Series OTT : చీకట్లో సైకో దెయ్యం పైశాచికత్వం… ఒళ్లు గగుర్పొడిచేలా ఒక్కో సీన్… ఒంటరిగా చూడొద్దు భయ్యా

Horror Web Series OTT : చీకట్లో సైకో దెయ్యం పైశాచికత్వం… ఒళ్లు గగుర్పొడిచేలా ఒక్కో సీన్… ఒంటరిగా చూడొద్దు భయ్యా
Advertisement

Horror Web Series OTT : ఓటీటీ ప్రియులు తరచుగా ఇంట్లోనే కూర్చుని ఎంటర్టైన్మెంట్ ను పొందడానికి ఇష్టపడుతున్నారు. అయితే అందులోనూ హారర్ సిరీస్ ప్రియుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే మనం ఈరోజు 2025లో వచ్చిన ఒక పాపులర్ హర్రర్ వెబ్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాము. దీని రెండవ సీజన్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వీక్షించిన వారు. 2026 సీక్వెల్ రాబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఈ ఉత్తమ హారర్ వెబ్ సిరీస్‌ను ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చో, దాని IMDb రేటింగ్‌ ఎంత అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

హర్రర్ అయినా లేదా మరే ఇతర జానర్ అయినా, అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సిరీస్‌లకు ఒక ముఖ్యమైన వేదిక. ఇందులో వచ్చిన హిట్ సిరీస్‌లలో ఒకదాన్ని చూస్తే రాత్రిపూట ఒంటరిగా ఉండాలంటే గుండె జారిపోద్ది. ఓటీటీలో పాపులర్ అయిన నటులు కొందరు ఇందులో కనిపించారు. మీరు ఇంకా ఈ సిరీస్‌ను చూడకపోతే, ఈ వారాంతంలో తప్పకుండా దీన్ని ప్రయత్నించండి. భయం అంటే ఎలా ఉంటుందో ఈ సిరీస్ లో చూస్తారు మావా. కంటి రెప్ప వేయలేనంత ఉత్కంఠభరితంగా ఉంటుంది.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. . ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అంధేరా’. ఇందులో ప్రజక్తా కోలి, కరణ్‌వీర్ మల్హోత్రా, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలు పోషించారు. రాఘవ్ దార్ దర్శకత్వం వహించారు. ఈ ప్రసిద్ధ వెబ్ సిరీస్ కు ఐఎండీబీలో 5.9 రేటింగ్ ఉంది. కానీ ప్రైమ్ వీడియోలో మాత్రం వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి. ఫలితంగా అందులో ఉన్న టాప్ హర్రర్ సిరీస్ జాబితాలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఈ సిరీస్ విడుదలై చాలా రోజులు అవుతోంది.

Read Also : ఓటీటీలోకి వచ్చేసిన సెన్సేషనల్ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’… అస్సలు మిస్ అవ్వొద్దు భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఈ సిరీస్ తప్పిపోయిన అమ్మాయిని వెతకడానికి జరిగే ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ పృథ్వీ సేథ్ (ప్రణయ్ పచౌరి)ను కలవడానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక, బని బారువా (జాన్వీ రావత్) భయంకరమైన రీతిలో అదృశ్యమయ్యే హృదయ విదారక సన్నివేశంతో సిరీస్ ప్రారంభమవుతుంది. పృథ్వీ కారు ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోతాడు. అతని సోదరుడు జై (కరణ్వీర్ మల్హోత్రా) డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. పీడకలలతో సతమతం అవుతాడు. ఇన్స్పెక్టర్ కల్పన కదమ్ (ప్రియా బాపట్) బని అదృశ్యంపై దర్యాప్తు చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో దొరికిన క్లూస్ పృథ్వీ, అతని తమ్ముడు జై దగ్గరకు తీసుకెళ్తాయి.

సమస్యల్లో ఉన్న జై తన ప్రశ్నలను, భయాలను ఎదుర్కోవడానికి అతీంద్రియ అనుభవాల పాడ్‌కాస్టర్ అయిన రూమి (ప్రజక్త కోలి) నుండి సహాయం కోరతాడు. కల్పన కదమ్‌ ను అప్పుడప్పుడు బాధపెట్టే బాధాకరమైన గతం ఉంటుంది. కానీ ఆత్మ అనే వైద్యం కేంద్రాన్ని నడుపుతున్న సుర్వీన్ చావ్లా సాంగత్యం ఆమెకు ఓదార్పునిస్తాయి. ఇక కల్పన తన దర్యాప్తులో ముందుకు సాగుతున్న కొద్దీ, బని కేసు కేవలం అదృశ్యం కాదని, అందులో భయంకరమైన శక్తి ప్రమేయం ఉందని గ్రహిస్తుంది. ఆ తరువాత ఏమైంది అన్నది తెరపై చూడాల్సిన కథ.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×