E-Paper
Advertisement

2026 Apple Event: 2026లో ఆపిల్ హంగామా.. ఐఫోన్ 18 ప్రో మాక్స్, OLED మ్యాక్‌బుక్, ఐఫోన్ 17e ఇంకా

2026 Apple Event: 2026లో ఆపిల్ హంగామా.. ఐఫోన్ 18 ప్రో మాక్స్, OLED మ్యాక్‌బుక్, ఐఫోన్ 17e ఇంకా
Advertisement

2026 Apple Event| ఆపిల్ 2026లో పెద్ద ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ సంవత్సరం కంపెనీ 50వ వార్షికోత్సవం. ఆపిల్ 50 వసంతాల మైలురాయి సందర్భంగా అనేక ఇన్నోవేటివ్, ప్రీమియం ప్రొడక్ట్ లాంచ్‌లు చేయనుంది. 2026 ప్రారంభంలోనే ఆపిల్ అనేక డివైస్‌లు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఈ లాంచ్‌లు ఆపిల్ ఫ్యూచర్ ప్రొడక్ట్ స్ట్రాటజీని రీడిఫైన్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, వేరబుల్ కేటగిరీలను ఆపిల్ రిఫ్రెష్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లీక్స్ ప్రకారం డిజైన్, పనితీరు, డిస్‌ప్లే అప్‌గ్రేడ్స్‌పై బలంగా ఫోకస్ ఉంటుంది.

ఐఫోన్ 18 సిరీస్ ఫ్లాగ్‌షిప్

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 2026లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ లైనప్‌లో వివిధ యూజర్లకు అనేక మోడల్స్ ఉంటాయి. అందరి కళ్లు 18 సిరీస్ ప్రో వేరియంట్స్‌పై ఉంటుంది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్.. సిరీస్‌ లో హైలైట్ నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్స్ సాధారణంగా ఆపిల్ అత్యాధునిక ఫీచర్లు చూపిస్తాయి.

ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో పెద్ద డిజైన్, హార్డ్‌వేర్ మార్పులు

Advertisement

ఐఫోన్ 18 ప్రో మాక్స్‌తో ఆపిల్ ఫ్రెష్ డిజైన్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. కంపెనీ ఇంతకుముందు మోడల్స్‌లో కెమెరా మాడ్యూల్స్ రీడిజైన్ చేసింది. ఈ ట్రెండ్ కొత్త లైనప్‌లో కొనసాగవచ్చు. కొత్త ప్రీమియం కలర్ ఆప్షన్లు రావచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. ఫేస్ IDని డిస్‌ప్లే లోపలికి మార్చవచ్చు. డైనమిక్ ఐలాండ్ పూర్తిగా అదృశ్యం అవుతుంది. ఈ మోడల్స్ A20, A20 ప్రో చిప్‌సెట్స్‌తో పవర్ అవుతాయి. ఈ ప్రాసెసర్లు మెరుగైన ఎఫిషియెన్సీ, పనితీరు ఇస్తాయి.

బడ్జెట్ యూజర్ల కోసం ఐఫోన్ 17e

ఆపిల్ 2026 ప్రారంభంలో ఐఫోన్ 17e లాంచ్ చేయవచ్చు. ఈ మోడల్ బడ్జెట్ ప్రాధాన్యంగా ఫోన్ కొనుగోలు చేసేవారికి టార్గెట్ చేస్తుంది. ఫోన్‌లో A19 చిప్‌సెట్ ఉండవచ్చు. లీక్స్ ప్రకారం.. LTPS OLED డిస్‌ప్లే ఉపయోగించవచ్చు. డిస్‌ప్లే లో మునుపటి మోడల్స్ కంటే థిన్నర్ బెజెల్స్ ఉండే అవకాశం ఉంది. రియర్ (వెనుకభాగం) కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఫ్రంట్ కెమెరా 18 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ ధర, పనితీరు మధ్య మంచి బ్యాలెన్స్ ఇస్తుంది.

OLED మ్యాక్‌బుక్ ప్రోలో పెద్ద డిస్‌ప్లే అప్‌గ్రేడ్

Advertisement

మ్యాక్‌బుక్‌లలో ఆపిల్ OLED డిస్‌ప్లేలు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. మ్యాక్‌బుక్ ప్రో లైనప్ ని పెద్ద అప్‌గ్రేడ్లు ఉండే అవకాశం ఉంది. కొన్ని మోడల్స్‌లో టచ్ సపోర్ట్ రావచ్చు. మ్యాక్‌బుక్ M6 ప్రో, M6 మాక్స్ వెర్షన్లు OLED ప్యానల్స్ ఉపయోగించవచ్చు. స్టాండర్డ్ మ్యాక్‌బుక్ వెర్షన్ IPS డిస్‌ప్లేలు కొనసాగించవచ్చు. ఈ మార్పు కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్, బ్యాటరీ ఎఫిషియెన్సీ మెరుగుపరుస్తుంది.

ఆపిల్ AI గ్లాసెస్ వేరబుల్ టెక్‌లో కొత్త ఎంట్రీ

ఆపిల్ తన మొదటి AI పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేయవచ్చు. ఈ గ్లాసెస్ మెటా రే-బాన్ ప్రొడక్ట్స్‌తో డైరెక్ట్ పోటీ పడవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. బిల్ట్-ఇన్ కెమెరాలు, స్పీకర్లు ఉంటాయి. AI పవర్డ్ వాయిస్ కమాండ్స్ సపోర్ట్ ఉండవచ్చు. యూజర్లు ఏఐ గ్లాసెస్ ద్వారా కాల్స్ చేయవచ్చు, ఫొటోలు క్యాప్చర్ చేయవచ్చు. ఈ గ్లాసెస్ రోజువారీ సౌకర్యం, స్మార్ట్ ఇంటరాక్షన్స్‌పై ఫోకస్ చేస్తాయి.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

ఐప్యాడ్ మినీలో ప్రీమియం అప్‌గ్రేడ్

ఆపిల్ 2026లో రిఫ్రెష్డ్ ఐప్యాడ్ మినీ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. డివైస్‌లో OLED డిస్‌ప్లే ఉండవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లు రావచ్చు. ట్యాబ్లెట్ A20 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఆపిల్ ఈ డివైస్‌ను సంవత్సరం చివర్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

యాంబిషియస్‌గా ఆపిల్ 2026 స్ట్రాటజీ

ఆపిల్ తన 50వ వార్షికోత్సవాన్ని బోల్డ్‌గా సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇన్నోవేషన్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌పై ఫోకస్ చేస్తుంది. ఈ సంవత్సరం కాబోయే లాంచ్‌లు ఆపిల్ తదుపరి దశాబ్దాన్ని కొత్త రూపరేఖలను సూచిస్తోంది.

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×