E-Paper
Advertisement

Aadi Sai kumar: రెండోసారి తండ్రి అయిన ఆది సాయి కుమార్.. శంబాల సక్సెస్ తర్వాత మరో గుడ్ న్యూస్..

Aadi Sai kumar: రెండోసారి తండ్రి అయిన ఆది సాయి కుమార్..  శంబాల సక్సెస్ తర్వాత మరో గుడ్ న్యూస్..

Aadi Sai kumar: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఆది అభిమానులకు ఒక శుభవార్త చెప్పాడు. హీరో ఆది సాయికుమార్ అరుణ మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.. ఈ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.. ఈ విషయాన్ని ఆది సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే వీళ్లకు ఒక కుమార్తె కూడా ఉంది.. ఆ పాప పుట్టిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత వాళ్ల నిరీక్షణ ఫలించింది. ఆ ఇంట్లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వడంతో ఆది సాయికుమార్ కుటుంబంలో సంతోషాలు వెల్లువిరిసాయి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆది సాయి కుమార్ కు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ఆది రీసెంట్గా శంబాల మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది..

2014 ఆది, అరుణల వివాహం..

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ గురించి అందరికి తెలుసు.. లెజండరీ యాక్టర్ సాయి కుమార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో జనాల చేత మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ అవి ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. గత కొన్నేళ్లుగా సినిమాలకి గ్యాప్ తీసుకునే హీరో రీసెంట్గా స్తంభాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మంచి సక్సెస్ ని సాధించింది.. ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ని ఆది తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అయినా భార్య అరుణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.. వీరికి ఆల్రెడీ ఒక పాప ఉందన్న విషయం తెలిసిందే.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.. కానీ ఇన్నాళ్లకు వాళ్ల కోరిక నెరవేరింది.. సాయి కుమార్ ఇంటికి వారసుడు వచ్చేసాడు.. పసివాడి రాకతో ఇంటిల్లి పాది ఆనందంగా ఉన్నారు. 2014 లో ఆది సాయి కుమార్, అరుణల వివాహం జరిగింది.. ఆయనకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 శంబాల మూవీ.. 

ఆది సాయి కుమార్ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఊహించని రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ అయ్యాయి..1980ల నాటి కథ. శంబాల అనే ఊర్లో ఓ ఉల్క పడుతుంది. ఆ ఉల్క పడిన నాటినుంచి ఆ ఊరిలో అన్నీ అపశకునాలు కనిపిస్తుంటాయి. శాస్ర్తాలను, దేవుళ్లనీ, దెయ్యాలనీ అమితంగా నమ్మే ఆ ఊరి జనం ఆ ఉల్కని ‘బండ భూతం’ అని పిస్తుంటారు.. దాని గురించి పూర్తి వివరాలను తెలుసుకొనేందుకు సైంటిస్ట్ గా ఆది ఆ ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న పరిస్థితులు గురించి ఇక్కడ స్టోరీలో చూపించారు.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ వారం రోజుల్లోనే రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

Related News

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

Big Stories

×