E-Paper
Advertisement

Horror comedy OTT: న్యూ ఇయర్ పార్టీలో నరాలు తెంపేసే ఉత్కంఠ… చావు కేక పెట్టించే సరదా

Horror comedy OTT: న్యూ ఇయర్ పార్టీలో నరాలు తెంపేసే ఉత్కంఠ… చావు కేక పెట్టించే సరదా
Advertisement

Horror comedy OTT : హారర్ సినిమాలు ఎక్కువగా భయపెడుతూ ఉంటాయి. వీటిలో రక్తపాతం కాస్త ఎక్కువనే ఉంటుంది. అయితే కొన్ని సినిమాలలో ఈ హారర్ కి కామెడీ ని కూడా జోడిస్తుంటారు. ఈ కంటెంట్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో జరుగుతుంది. ఆ రాత్రి భయంకరమైన కాలరాత్రి అవుతుంది. ఓ పక్క మర్డర్లు జరుగుతూనే, మరోవైపు నవ్వు కూడా తెప్పిస్తుంది ఈ సినిమా. ఇది సీరియస్ హారర్ సినిమాలా కాకుండా, ఇందులో హింసతో పాటు కామెడీ కూడా మిక్స్ అయి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ పోలిష్ బ్లాక్ కామెడీ హారర్ మూవీ పేరు ‘ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ డెడ్’ (All My Friends Are Dead). జాన్ బెల్క్ రాసి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూలియా వినీవా, మికాల్ మేయర్, ఆడమ్ వోరోనోవిచ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2021 ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక పెద్ద విల్లాలో న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది. బోలెడంత మంది కుర్రాళ్లు, అమ్మాయిలు ఫుల్ ఎంజాయ్‌మెంట్ కోసం అక్కడ కలిశారు. అక్కడ డ్రగ్స్, మద్యంతో పార్టీ సందడిగా మొదలవుతుంది. కానీ ఆ పార్టీలో ఒక్కొక్కరిలో ఒక్కో ఫ్రస్ట్రేషన్, సీక్రెట్స్ ఉంటాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఒక గన్ కనిపిస్తుంది. ఆ గన్‌తో ఆడుకుంటున్నప్పుడు మిస్ ఫైర్ అయ్యి ఒకరు చనిపోతారు. సరిగ్గా అక్కడి నుండే అసలు గందరగోళం మొదలవుతుంది. ఆ చావుని చూసి మిగిలిన వాళ్లందరూ భయపడిపోతారు.

ఇక అక్కడ ఒకరిని ఒకరు అనుమానించుకోవడం, గొడవ పడటం మొదలుపెడతారు. పార్టీకి వచ్చిన వాళ్లలో అపార్థాలు పెరిగిపోయి… ఒకరిని ఒకరు కొట్టుకోవడం, చంపుకోవడం మొదలుపెడతారు. చివరికి ఏమవుతుందంటే, తెల్లారేసరికి ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా దాదాపుగా శవాలుగా మారిపోతారు. బయట నుండి పోలీసులు వచ్చి లోపల జరిగిన ఘోరాన్ని చూసి షాక్ అవుతారు. అసలు అక్కడ ఏం జరిగింది ? ఎందుకు ఒకర్ని ఒకరు చంపుకున్నారు ? ఈ గందరగోళాన్ని మీరు కుడా చూడాలనుకుంటే, ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

Advertisement

Read Also : 47 అవార్డులతో ప్రశంసలు… అప్పు ఇచ్చిన బ్యాంకుకే కన్నం… చూసే కొద్దీ చూడాలనిపించే మూవీ

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×