E-Paper
Advertisement

Inzamam-ul-Haq: “క్షుద్ర పూజ‌లు” చేసి ఇంగ్లాండ్ ను ఓడించారు..ఇండియాపై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు

Inzamam-ul-Haq: “క్షుద్ర పూజ‌లు” చేసి ఇంగ్లాండ్ ను ఓడించారు..ఇండియాపై ఇంజమామ్ ఆరోప‌ణ‌లు
Advertisement

Inzamam-ul-Haq: T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్ దశకు వచ్చింది. ముంబై ( Wankhede Stadium, Mumbai) వేదికగా గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, విక్టరీ అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే, టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషప్రచారం చేస్తున్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల టీమిండియా గెలిచిందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ ప్లేయర్లపై క్షుద్ర పూజలు చేశారని అందుకే వాళ్ళు ఓడిపోయారని బాంబు పేల్చారు. క్షుద్ర పూజలు చేయడం కారణంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణిస్తున్న క్ర‌మంలోనే బంతిలో చిప్ పెట్టి క్షుద్ర పూజ‌లు ( ( black magic on England ) ) చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేశారు. లేకపోతే టీమిండియా ఫైనల్స్ దాకా రాకపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ వుల్ హక్.

Advertisement

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

“క్షుద్ర పూజ‌లు” చేసి ఇంగ్లాండ్ ను ఓడించారు

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రెండో సెమీఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి క్షణంలో ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. 254 పరుగులు టీమిండియా చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించేందుకు చాలా కష్టపడింది ఇంగ్లాండ్. కానీ టీమిండియా బౌలర్లు డెత్ అద్భుతంగా వేశారు. దీంతో మ్యాచ్ టర్న్ అయింది. ఈ నేపథ్యంలోనే విజయం సాధించింది టీమిండియా.

Advertisement

అయితే టీమిండియా డెత్ ఓవర్లు అద్భుతంగా వేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరి 15వ ఓవర్ నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని పేర్కొన్నాడు. బంతిలో చిప్ పెట్టడం వల్ల బుమ్రా, అర్షదీప్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారని ఆరోపణలు చేశారు ఇంజమామ్ వుల్ హక్. దానికి తోడు ఇంగ్లాండ్ ప్లేయర్లపై క్షుద్ర పూజలు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) చేయించిందని బాంబు పేల్చారు.  ఈ దెబ్బకు ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారని వెల్లడించారు ఇంజమామ్ వుల్ హక్. ఈ దెబ్బకు ఇంగ్లాండు ఓడిపోయి ఇంటిదారి పట్టిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇంజమామ్-ఉల్-హక్ చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై ఇండియ‌న్స్ కౌంట‌ర్లు పేల్చుతున్నారు.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×