E-Paper
Advertisement

పుట్టినరోజునే చావు కేకలు… ప్రతిరోజు చచ్చి బతికే అమ్మాయి… బుర్ర హీటెక్కించే టైమ్ లూప్ కాన్సెప్ట్

పుట్టినరోజునే చావు కేకలు… ప్రతిరోజు చచ్చి బతికే అమ్మాయి… బుర్ర హీటెక్కించే టైమ్ లూప్ కాన్సెప్ట్
Advertisement

Horror Comedy OTT : టైమ్ లూప్ కాన్సెప్ట్ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందులో హారర్, కామెడీ ఎలిమెంట్స్ ఉంటే కిక్కు మరింత వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఒకే రోజు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే టైమ్ లూప్ కాన్సెప్ట్‌కి మర్డర్ మిస్టరీని కలిపి చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారు. రక్తపాతం ఎక్కువగా లేకుండా, కాసేపు థ్రిల్ అవుతూ సరదాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది కాబట్టే ఈ మూవీకి అంత క్రేజ్ వచ్చింది. ఇందులో కిల్లర్ మాస్క్ పెట్టుకుని మరీ హీరోయిన్ ని చంపుతాడు. అయితే టైమ్ లూప్ లో ఆమె మళ్ళీ బతికి చస్తూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు క్రేజీగా ఉంటుంది ఈ సినిమా.

జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ హర్రర్ కామెడీ సినిమా పేరు ‘హ్యాపీ డెత్ డే’ (Happy Death Day). 2017లో వచ్చిన ఈ సినిమాలో జెస్సికా రోత్, ఇజ్రాయెల్ బ్రౌసార్డ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా కేవలం 4.8 (40 కోట్లు) మిలియన్ డాలర్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 125 (1000 కోట్లు) మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ప్రముఖ హర్రర్ నిర్మాణ సంస్థ బ్లమ్‌హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, క్రిస్టోఫర్ ల్యాండన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కిల్లర్ వాడే ఆ వింతైన బేబీ మాస్క్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది; దీనిని ప్రసిద్ధ ‘స్క్రీమ్’ సినిమా మాస్క్ డిజైనరే రూపొందించడం విశేషం. హీరోయిన్ జెస్సికా రోత్ ఈ సినిమాలో ఒకే సీన్‌ను (నిద్రలేవడం) వేర్వేరు ఎమోషన్స్ తో పదే పదే అద్భుతంగా పండించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌కు హర్రర్, కామెడీని కలిపి కొత్తగా చూపించినందుకు ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి, అందుకే 2019లో దీనికి Happy Death Day 2U అనే సీక్వెల్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా JioHotstarలో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ట్రీ అనే ఒక కాలేజీ అమ్మాయి తన పుట్టినరోజు నాడే ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి చేతిలో హత్యకు గురవుతుంది. కానీ విచిత్రంగా ఆమె చనిపోయిన ప్రతిసారీ, మళ్ళీ అదే రోజు ఉదయం నిద్రలేస్తుంది. అంటే ఆమె ఒకే రోజులో చిక్కుకుపోతుంది. మొదట ఇది కల అనుకున్నా, ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ అదే రోజు రిపీట్ అవుతుండటంతో ఆమెకు అసలు విషయం అర్థమవుతుంది. తనని చంపుతున్న ఆ హంతకుడు ఎవరో కనిపెడితే తప్ప ఈ లూప్ ఆగదని ఆమె గ్రహిస్తుంది. అందుకే ప్రతిరోజూ కొత్త కొత్త ప్లాన్లతో తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద నిఘా పెడుతుంది. ఒక్కొక్కరిని అనుమానిస్తూ, చస్తూ చస్తూనే హంతకుడి వేట మొదలుపెడుతుంది. ముసుగు వేసుకున్న కిల్లర్ నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి హీరోయిన్ చేసే ప్రయత్నాలు భయపెడుతూనే, మరోపక్క ఆమె పడే పాట్లు భలే నవ్వు తెప్పిస్తాయి. తన ఫ్రెండ్స్‌లో ఎవడో ఒకడు ఈ వెన్నుపోటు పొడుస్తున్నాడని కనిపెట్టి, వాడి తాట తీయడానికి రెడీ అవుతుంది. చివరకి ఆ ఆమ్మాయి కిల్లర్ ఎవరో కనిపెడుతుందా ? ఈ టైమ్ లూప్ నుండి బయటపడుతుందా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : ఆ యాప్ క్లిక్ చేశావో నీ సమాధి నీవే తవ్వుకున్నట్లు.. ఓటీటీలోకి భయం పుట్టించే థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×