E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేకకు వార్నింగ్ ఇచ్చిన అపర్ణ 

Brahmamudi Serial Today Episode April 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేకకు వార్నింగ్ ఇచ్చిన అపర్ణ 
Advertisement

Brahmamudi serial today Episode: లక్ష్మీ, చలపతి పెళ్లి రోజును గ్రాండ్‌గా చేయడానికి రాజు, ఇందు, వెంకట్‌, నందు వంటలు చేస్తుంటారు. చికెన్‌ కొంచెమే తీసుకొచ్చాను రెండు కిలోలు ఎలా సరిపోతాయి అంటూ రాజు అడగ్గానే.. చికెన్ డైరెక్టుగా వేస్తే సరిపోదు కానీ కప్పులో వేస్తే సరిపోతుంది. దీంతో రాజు కప్పులో వేస్తే నాకే సరిపోదు వచ్చిన వాళ్లు ఏమనుకుంటారు అని చెప్పగానే.. అయితే ఓ పని చేద్దాం.. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లకు తినడానికి ముందే నిమ్మరసం చేసి ఇద్దాం. నిమ్మరసం తాగాక తక్కువగా తింటారు అని ఇందు చెప్తుంది. దీంతో వెంకట్‌ ఐడియా అదిరిపోయింది.. ఇంకెందుకు లేటు వెళ్లి అందరినీ పిలుద్దామని అంటాడు.

దీంతో ఎక్కడికి వెళ్లేది. చేద్దాం అనుకోవడం వేరు చేసేది వేరు. నేను ఏదో అనుకుంటున్నాను.  చిన్నగా బిజినెస్‌ మొదలు పెట్టి ఈ సిటీలోనే పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ అవ్వాలని కానీ నేను ఇంకా బిజినెస్సే మొదలుపెట్టలేదు. ఇది కూడా ఇంతే అంటూ వెటకారంగా చెప్పగానే.. ఇందు నమ్మకంగా మనం చేసే పని వైపు ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా సక్సెస్‌ అవుతాం. అంతే కానీ అడ్డదారిలో వెళ్లి సంపాదించుకోవాలంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనగానే.. వెంకట్‌ కరెక్టుగా చెప్పారు అంటాడు. ఇంతలో నందు వెంక ఒక పని చేయ్‌ నువ్వు నందు ఈ పక్క వీధిలోకి వెళ్లి జనం అందరినీ పిలవండి. నేను మీ అన్నయ్య ఆ పక్క వీధిలోకి వెళ్లి అందరినీ పిలుస్తాం అని చెప్పగానే.. సరే అంటూ అందరూ వెళ్తారు.

Advertisement

రాజు, ఇందు ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు. ఏంటి సైలెంట్‌గా ఉన్నావు..? వాళ్లను పిలువు అని చెప్పగానే.. నువ్వు ఉన్నావు కదా పిలువు అనగానే.. ఇందు కోపంగా ఏయ్‌ ఇప్పుడు పిలుస్తావా..? లేదా..? అని చెప్పగానే.. పిలవకపోతే ఏం చేస్తావు.. ఆ డల్లాస్‌ గాడికి చెప్తావా..? అంటూ రాజు అడగ్గానే.. డల్లాస్‌ కే కాదు.. మీ అమ్మా నాన్నలకు కూడా చెప్తాను.. నన్ను కిడ్నాప్‌ చేశావని అంటూ బెదిరించగానే.. రాజు అమ్మా వద్దు తల్లి అంటూ ఆ ఇంట్లో వాళ్లను పిలుస్తాడు. వాళ్లు బయటకు వచ్చాక ఫంక్షన్‌ గురించి చెప్పి తప్పకుండా రావాలంటూ పిలిచి వెళ్లిపోతాడు.

మరోవైపు వెంకట్‌, నందు పక్క వీధిలో ఒక ఇంటి దగ్గరకు వెళ్లి పెళ్లి ఫంక్షన్‌ ఉంది రమ్మని పిలిస్తే ఆ ఇంట్లో ఆవిడ నీకు కొంచమైనా బుద్ది ఉందారా..? మీ అన్నకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా..? ఇక వాడికి ఈ జన్మకు పెళ్లి కాదు అంటూ తిడుతుంటే.. వెంకట్ ఆంటీ నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ అమ్మాయి నా ప్రెండ్‌ అని చెప్పగానే.. మరి పెళ్లి ఫంక్షన్‌ అన్నావు అని ఆవిడ అడగ్గానే.. నందు కల్పించుకుని వీళ్ల అమ్మా నాన్నల పెళ్లి రోజు ఫంక్షన్‌ చేస్తున్నావు తప్పకుండా రావాలి అంటూ చెప్పి వెళ్లిపోతారు.

Advertisement

మరోవైపు ఇంట్లో కూర్చున్న రేఖ బాధపడుతుంటే భ్రమరాంబ వచ్చి ఏంటి అలా ఉన్నారు..? ఏం జరిగింది..? యాభై లక్షలు తీసుకొస్తానన్నారు.. అసలు ఏం జరిగింది.. అంటూ భ్రమరాంబ అడగ్గానే.. భూషణ్‌ వాడు డబ్బులు ఇవ్వనన్నాడు అక్కా అని చెప్పగానే.. మరి నగలు తిరిగి ఎక్కడికిపోయాయి అని అడగ్గానే.. పాత అప్పు కిందకు ఆ నగలు తాకట్టు పెట్టుకున్నాడు అని చెప్పగానే.. భ్రమరాంబ బాధపడుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి నా మనవరాలిని తీసుకురాలేరా..? నేను వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తాను. మీడియాకు చెప్తాను అంటూ బెదిరించగానే.. రేఖ కూడా ఏంటి నోరు లేస్తుంది అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇన్ని రోజులు నా మనవరాలి కోసం మౌనంగా ఉన్నాను.. ఇప్పుడు అదే లేకపోతే ఊరుకుంటానా..? మీకు రెండు రోజుల టైం ఇస్తున్నాను నా మనవరాలిని తీసుకురాకపోతే ఏం చేయాలో అదే చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు ఇందు ఇంట్లో పూజ చేసి రాజు, వెంకట్‌ చేత లక్ష్మీ, చలపతిల కాళ్లు మొక్కిస్తుంది. తర్వాత అందరూ కలిసి ఫంక్షన్‌ కోసం వంట చేస్తుంటారు. అప్పుడే లక్కీ వచ్చి చాటు నుంచి రాజుకు సైగ చేస్తుంటాడు. రాజు మాత్రం చూడడు. దీంతో చిన్న రాయి తీసుకుని రాజు కోసం వేస్తే.. అది వెళ్లి చలపతికి తగులుతుంది. మళ్లీ ఇంకో రాయి వేస్తే అది వెంకట్‌కు తగులుతుంది. మరో రాయి తీసుకుని వేయబోతుంటే.. నందు చూసి హలో ఆ వెధవ నీకు సైగలు చేస్తున్నాడు. చిన్న చిన్న రాళ్లు విసురుతున్నాడు. ఇక్కడ నీకు తప్పా అందరికీ తగులుతున్నాయి. వాడు రాడు కానీ నువ్వే వెళ్లు అని చెప్పగానే.. రాజు, ఇందు దగ్గరకు వెళ్తాడు. లక్కీకంగారుగా ఆ పోలీస్‌ పిల్లకు మనమే కిడ్నాపర్లం అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ కంగారుపడుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×