E-Paper
Advertisement

Horror Movie OTT :  దెయ్యాలను వదిలించే భూత వైద్యుడు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Horror Movie OTT :  దెయ్యాలను వదిలించే భూత వైద్యుడు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..
Advertisement

Horror Movie OTT : ఓటీటీలో రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. మలయాళ, తమిళ సినిమాలు తెలుగులో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. హారర్ సినిమాలకు ఏ భాషలో అయిన డిమాండ్ ఉంటుంది.. కన్నడ హారర్ మూవీ ఒకటి ఓటీటీకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇదొక విభిన్నమైన స్టోరీ.. హారర్ సన్నివేశాల తో పాటుగా కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది.. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

మూవీ & ఓటీటీ.. 

Advertisement

కన్నడ హారర్ మూవీ చూ మంతర్.. కన్నడ నటుడు శరణ్ నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మూడు నెలల్లోనే 60 సినిమాలు రిలీజైనా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సంక్రాంతికి వచ్చిన ఈ ఛూ మంతర్ మూవీయే కాస్త సక్సెస్ సాధించింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. దాదాపుగా 50 రోజుల పాటుగా మంచి సక్సెస్ రేటును అందుకుంది. కర్వ అనే హారర్ డ్రామా తీసిన డైరెక్టర్ నవనీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తరుణ్ శివప్ప నిర్మించిన ఈరోజు మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఓటిటిలోకి స్ట్రీమింగ్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ దీన్ని స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతుంది.. నేడు ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది అయితే ఇది తెలుగులో రాలేదు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూసేయొచ్చు..

Also Read: కాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన కల్పిక.. సూసైడ్ చేసుకోవాలకున్న..

Advertisement

స్టోరీ విషయానికొస్తే.. 

ఇదొక హారర్ కామెడీ సినిమా ఈ మూవీలో శరణ్ తోపాటు ప్రభుదేవా, చిక్కన్న, ప్రభు ముండ్కర్, మేఘనా గవోన్కర్, రజనీ భరద్వాజ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాలో శరణ్ డ్యుయల్ రోల్లో నటించాడు. అతీత శక్తులు ఉన్న భూత వైద్యుడు పాత్రలో ఆయన నటించాడు. ఒకేసారి రెండు చోట్ల దుష్ట శక్తుల అంత చెప్పేలా ఆ పాత్ర క్రియేట్ చేశారు. మోర్గాన్ హౌస్ అనే ఓ మ్యాన్షన్ లో జరుగుతున్న అతీత శక్తుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ పాత్ర ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో అతడు విఫలం కాగా.. అతని కొడుకు గౌతమ్ కూడా అదే పనిలో ఉంటాడు.. ఆ ఇంట్లో దుష్టశక్తులు ఎక్కువగా ఉన్నాయంటే కచ్చితంగా నిధి కూడా ఉంటుందని వాళ్ళు నమ్ముతుంటారు. ఈ స్టోరీ అనేక ట్విస్టులతో మైండ్ బ్లాక్ అయ్యే మలుపులతో ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్విస్తుంది.. అందుకే ఈ సినిమా భారీ విషయాన్ని అందుకుందనే చెప్పాలి. 50 రోజులకు పైగా సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవ్వడం మామూలు విషయం కాదు. అక్కడ భారీ విజయనందుకు ఉన్న ఈ మూవీ ఓటీడీలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి…

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×