Wife and Husband : కాఫీలో విషం కలిపి చంపేయడం. ఎంత సింపుల్ ఐడియా. వన్ బ్యాడ్ మార్నింగ్ అదే పని చేసింది ఓ భార్య. తన భర్తకు విషం కలిపిన కాఫీ ఇచ్చింది. విషం ఉందని తెలీని అతను ఆ కాఫీ తాగేశాడు. కట్ చేస్తే.. ఆ భార్య మర్డర్ స్కెచ్ జస్ట్ మిస్. చచ్చిపోతాడనుకున్న భర్త.. చావలేదు కానీ.. చచ్చినంత పనైంది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. యూపీ, ముజఫర్‌నగర్‌లోని భగేలా గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇంతకీ ఆ భార్య తన భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలిస్తే మరింత షాక్ అవ్వాల్సిందే.
అనూజ్ శర్మ, సనా. ఇద్దరూ భార్యాభర్తలు. ఫోటో చూశారుగా. చూడచక్కని జంట. చుట్టుపక్కన వాళ్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పొగుడుతుంటారు. చూపులకు చక్కగా ఉంటే సరిపోతుందా? బుద్ధి కూడా సరిగ్గా ఉండాలిగా? వీళ్ల మధ్య తరుచూ గొడవలు. మొగుడూపెళ్లాలు అంటే గొడవలు కామనేగా అనుకునేరు. కానీ, దాదాపు ప్రతీరోజూ ఫైటింగే. ఎవరూ తగ్గరు. నువ్వొకటంటే నేను రెండంటా.. అనేలా పరస్పరం తిట్టుకోవడం, అప్పుడప్పుడూ కొట్టుకోవడం వారికి కామన్. ఇద్దరూ యంగ్ కపుల్స్ కావడంతో టెంపర్‌మెంట్‌లో తగ్గేదేలే అనే రేంజ్‌లో గొడవ పడుతుంటారు. ఆ గొడవ డోస్ పెరిగినప్పుడు.. గతంలో పలుమార్లు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది వారి బాగోతం. ఖాకీలు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు. ఇంటికొచ్చాక మళ్లీ లొల్లి షురూ. ఇలా సాగుతోంది వారి కలహాల కాపురం. ఆ రచ్చబండ.. వారి బతుకు జట్కాబండిగా మార్చేసింది. కట్ చేస్తే..
మార్చి 24న అనూజ్ శర్మ, సనాల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఈ సారి టాపిక్ ఏంటంటే.. సనా వేరే అతనితో మాట్లాడుతుంటే భర్త తప్పుబట్టాడు. వాడితో నీకు మాటలేంటి? అంటూ అభ్యంతరం చెప్పాడు. భర్త మాటలతో ఆ భార్యకు కాలింది. కోపంతో తను కూడా నోటికి పని చెప్పింది. అతనో మాట.. ఆమె ఇంకో మాట. అలా అలా డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. ఈ సారి గొడవను మరింత సీరియస్‌గా తీసుకుంది సనా. ఎప్పుడూ ఇంతేనా ఇక? నా మొగుడు మారడిక అని ఫిక్స్ అయింది. భర్తను చంపేస్తే పీడా పోతుందని డిసైడ్ అయింది. హౌ టూ కిల్ హజ్బెండ్ అంటూ గూగుల్‌లో సెర్చ్ చేసింది. అనేక ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఓ మర్డర్ ప్లాన్ ఆమెకు నచ్చేసింది. ఇలా చంపితే ఈజీగా పనై పోతుందని.. ఆ ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుందని భావించింది. ఇక అంతే. తెల్లారగానే హత్యా పథకం అమల్లో పెట్టేసింది.
మార్చి 25. ఉదయం. భర్త కోసం కాఫీ కలిపింది. అప్పటికే కొని తెచ్చి పెట్టుకున్న పాయిజన్‌ను అందులో మిక్స్ చేసింది. అనుమానం రాకుండా భర్తకు అందించింది. అతను కాఫీనే కదాని తాగేశాడు. అంతే. కాఫీతో పాటు గొంతులోకి దిగిన విషం.. తన పని ప్రారంభించేసింది. రక్తంలో కలిసిపోయింది. ఆఫీసుకు వెళ్లిన అనూజ్ శర్మ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌లో చేర్చగా అతని కండిషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు భార్య సనాపై మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.