BigTV English

Actress Kalpika:  కాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన కల్పిక.. సూసైడ్ చేసుకోవాలకున్న..

Actress Kalpika:  కాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన కల్పిక.. సూసైడ్ చేసుకోవాలకున్న..

Actress Kalpika: ఈ మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీలోనూ ఎక్కువగా వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్.. వివిధ భాషలకు చెందిన నటీమణులు గత కొన్నేళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎక్కువైపోయింది. దీంతో ఈ వ్యవహారంపై బయటకొచ్చి నోరు విప్పితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో? లేక ఏదైనా చేస్తారేమో? అన్న భయంతో ఎవ్వరు కూడా చాలా ఏళ్లుగా నోరు విప్పలేదు. ఇప్పుడు ఒక్కొక్కరు ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ఈ క్రమంలో నటి కల్పిక గణేష్ కూడా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఒకానొక సందర్బంలో బయటపెట్టింది. ఆ తర్వాత ఆమె చాలా పరిస్థితులను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి తొలిసారి స్పందించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.. అసలు ఆమె ఎలాంటి విషయాలను షేర్ చేసుకుందో తెలుసుకుందాం..


ఇంటర్వ్యూలో సంచలన విషయాలు.. 

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే అందుకు కారణాన్ని కూడా తెలిపింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మీరు కూడా పడ్డారా? అని యాంకర్ నటి కల్పికను అడగ్గా.. మొదట్లో నేను అమయాకత్వంతో ఉండటం వల్ల కొన్నిసార్లు కొన్ని ప్లేస్‌లలో అప్రోచ్ అయ్యాను. తర్వాత తర్వాత వాళ్లకే అర్థం అయింది. నేను ఆ టైప్ కాదని.. అప్పటి నుంచి నాకు అవకాశాలు వరుసగా తగ్గుతూ వచ్చాయి అని కల్పిక గణేశ్ తెలిపారు.. అయితే ఈ వ్యవహారం డైరెక్ట్‌గా అయినా అవుతుంది లేక ఇన్‌డైరెక్ట్‌గా అయినా అవుతుందని.. అయితే దాన్ని మనం ఎలా డీల్ చేస్తామన్నది విషయం అని చెప్పుకొచ్చారు. అయితే ఎవరైనా నన్ను డైరెక్టగా వచ్చి అడిగితే.. నేరుగా ఫేస్ టు ఫేస్ చెప్పేదాన్ని. ఇంకోసారి ఇలా చేస్తే చెంప చెల్లుమనిపిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఇలాంటి వాటికోసం అయితే మళ్లీ పిలవకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగేదని చెప్పుకొచ్చారు..


సూసైడ్ అటెంప్ట్.. 

చేతిలో అవకాశాలు లేక, బయట కొందరి మాటలు నన్ను బాగా భాధించాయి. అందుకే కొన్ని సెన్సిటివ్ పరిస్థితులలో సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ అందరు చూసి కాపాడారు అని ఆమె అన్నారు. దాంతో నేను ఇలా మీ ముందు ఉన్నాను. అయితే అవకాశాలు లేకపోవడం ఇలాంటి మాటలు వినడంతో నేను చాలా డిప్రెషన్ కి లోనయ్యాను దాదాపు 6 నెలల వరకు నన్ను నేను మర్చిపోయి డిప్రెషన్ లోనే ఉండిపోయానని కల్పిక అన్నారు. ఇక అంతేకాదు యశోద, అధర్వ సినిమాల్లో మంచి రోల్స్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే రిజక్షన్స్ రావడం పై మాట్లాడుతూ.. నేను సైడ్ ఆర్టిస్ట్‌గా చేయడం లేదా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడంతో కొన్ని రిజక్షన్స్‌ను ఫేస్ చేశాను. ఎందుకంటే.. హీరోయిన్ కంటే బాగున్నానని.. హీరోయిన్ కంటే బాగా మాట్లాడుతున్నానని.. హీరోయిన్ కంటే టాల్‌గా ఉన్నానని చెప్పి నన్ను సైడ్ చేసేవారు.. అయిన పర్వాలేదు టాలెంట్ మనకు అన్నం పెడుతుందని ఆమె ఇంటర్వ్యూ లో అన్నారు. మంచి పవర్ఫుల్ పాత్రలు వస్తే నేను సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×