Telugu TV Serials : తెలుగు ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకొనే వాటిలో టాప్ సీరియల్స్ ముందువరుసలో ఉంటాయి. ఇప్పటివరకు వచ్చే సీరియల్స్ అన్ని కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.. తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో కొత్త సీరియల్స్ కు కొదవలేదు. ఒకదానికి మించి మరొకటి స్టోరీ ఉంటుంది. ప్రతి రోజు ప్రసారం అవుతున్న వాటిలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కొత్త సీరియల్స్ కూడా స్టోరీతో ఆకట్టుకోవడంతో బాగా క్రేజ్ ను సంపాదించుకున్నాయి. మొన్నటివరకు స్టార్ మా లో కార్తీక దీపం సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్లేస్ ను మరో కొత్త సీరియల్ రీప్లేస్ చేసిందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఆ సీరియల్ ఏది? టీఆర్పీ రేటింగ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
గతంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం 2 సీరియల్ వచ్చింది. మొదటి పార్ట్ లో ఉన్నట్లు రెండో పార్ట్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి పార్ట్ లో లవ్ స్టోరీ జనాలను బాగా ఆకట్టుకుంది. కానీ రెండో పార్ట్ లో మాత్రం రివేంజ్ స్టోరీలాగా ఉందనే వాదన జనాల్లో వినిపిస్తుంది. కార్తీక దీపం 2 లో మళ్లీ దీపను పెళ్లి చేసుకోవడం అందరిని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి ఎపిసోడ్ కూడా ఏదో మూకుముడిగా సాగుతుందని జనాల నుంచి వాదన వినిపిస్తుంది. ఈమధ్య టిఆర్పి రేటింగ్ విషయంలో కార్తీకదీపం 2 సీరియల్ బాగా ముందంజలో ఉంది.. ముఖ్యంగా డాక్టర్ బాబు దీపల యొక్క రెండో పెళ్లి జనాలను కాస్త ఆకట్టుకోవడంతో టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెరిగింది.. జ్యోత్స్న రివెంజ్ కోసం ఎంతకైనా తెగిస్తుంది అన్నది ఈ సీరియల్ స్టోరీలో కాస్త హైలెట్ గా నిలిచింది. కొత్త సీరియల్ రావడంతో పాత సీరియల్ కి రేటింగ్ పడిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీకదీపం 2 టిఆర్పి రేటింగ్ 12.36 గా ఉంది..
గత ఏడాది డిసెంబర్లో బోలెడు సీరియల్స్ జనాల ముందుకు వచ్చాయి.. అందులో ఒకటి డిసెంబర్ 22న ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లికాని నలుగురు అన్నదమ్ముల ఇంట్లోకి ఒక ఆడపిల్ల రావడానికి ఇష్టపడడం లేదు. ఇక ఏ పెళ్లి సంబంధం కోసం వెళ్లినా కూడా అక్కడ వాళ్ళందరూ కూడా మగ పిల్లలు ఉన్న ఇంటికి మా ఆడపిల్లని ఎలా పంపించాలి అని అనుకుంటారు. అంతేకాదు బృందావనం అనే పాడుబడ్డ ఇంట్లో ఎలా నా కూతురు కాపురం చేస్తుంది అని చాలామందిని తల్లిదండ్రులు ఆ ఇంటికి పిల్లనివ్వడానికి సంకోచిస్తారు. అలాంటి కుటుంబంలోని వ్యక్తి చక్రి. అతను ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు..
Also Read : పల్లవితో సేవలు చేయించుకున్న శ్రీయ.. అవనిని ఆడుకున్న శ్రీయ.. పల్లవి నెక్స్ట్ ప్లానేంటి..?
మహా అనే గొప్పింటి అమ్మాయి అందానికి ఫీదా అవుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూనే తన లవ్ లైన్ ని క్లియర్ చేసుకోవాలని అనుకుంటాడు. ప్రస్తుతం ఇంట్లోంచి అమ్మాయిని తీసుకొస్తాడు. ఆ తర్వాత జరిగే స్టొరీ ఎలా ఉంటుందో అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ సీరియల్ లోకి గుండె నిండా గుడిగంటలు హీరో బాలు కూడా ఎంట్రీ చేస్తాడు.. అదే హైలెట్ గా మారుతుంది. ఇవాళ ఎపిసోడ్లు ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో ఒకసారి మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. కొత్తగా ప్రారంభమైన ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో మాత్రం ముందంజలో ఉందని తెలుస్తుంది. మరి దీని రేటింగ్ 12 ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలాగే కొనసాగితే మాత్రం మిగిలిన పాత సీరియల్స్ శుభం కార్డు వేసుకోవాల్సిందే అని జనాల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.. చూడాలి ఏ సీరియల్ ఎలాంటి రేటింగ్ ని ఇకముందు సొంతం చేసుకుంటుందో..