E-Paper
Advertisement

Horror Comedy OTT : ముగ్గురు స్నేహితులను ముప్పుతిప్పలు పెట్టే ఆత్మ… ఓటీటీలోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ మూవీ

Horror Comedy OTT : ముగ్గురు స్నేహితులను ముప్పుతిప్పలు పెట్టే ఆత్మ… ఓటీటీలోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ మూవీ
Advertisement

Horror Comedy OTT : ఓటీటీలోకి మరో మలయాళ హారర్ కామెడీ ఎంట్రీ ఇస్తోంది. నాలుగు వారాల పాటు అద్భుతంగా థియేటర్లలో ప్రదర్శించబడిన తర్వాత, ఈ మలయాళం మూవీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ మలయాళ హారర్ కామెడీ చిత్రం పేరు ‘ప్రకంపనం’ (Prakambanam). 2026న జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విజయేష్ పానాతుర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవరస ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీజిత్ కె.ఎస్ కార్తేకేయన్ ఎస్ సుధీష్ ఎన్ కలిసి నిర్మించారు. ఇందులో గణపతి, సాగర్ సూర్య, అల్ అమీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మల్లికా సుకుమారన్, అజీస్ నెడుమంగడ్ రాజేష్ మాధవన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి హరిప్రసాద్ సంగీతం అందించారు. ZEE5 ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చి మొదటి వారం నాటికి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఒక నెలలోనే దాదాపు 20 కోట్లు వసూలు చేసింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిద్ధార్థ్, పుణ్యాలన్, శంకరన్ అనే ముగ్గురు కుర్రాళ్ళు ఎర్నాకుళంలోని ఒక పాత కాలేజీ హాస్టల్‌లో ఉంటారు. వీళ్ళకి చదువు మీద కంటే, హాస్టల్‌లో చేసే ప్రాంక్‌లు, చిన్న చిన్న గొడవలు, పక్క రూమ్ వాళ్లను ఏడిపించడం మీదనే శ్రద్ధ ఎక్కువ. వీళ్లు చేసే అల్లరితో హాస్టల్ వార్డెన్‌కు చుక్కలు కనిపిస్తుంటాయి. ఇక కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఒకరోజు రాత్రి వీళ్లు చేసిన ఒక పిచ్చి పని వల్ల, అనుకోకుండా ఒక ఆత్మ వాళ్ల గదిలోకి వస్తుంది. ఆ దెయ్యం వీళ్ళల్లో ఒకడిని ఆవహిస్తుంది.

అది ఏదో పాతకాలం నాటి సీరియస్ దెయ్యంలా కాకుండా, చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ నవ్వు తెప్పిస్తుంది. దెయ్యం పట్టిన తన ఫ్రెండ్‌ను చూసి మిగతా ఇద్దరు భయపడటం, వాడిని నార్మల్ చేయడానికి వాళ్లు చేసే వింత ప్రయత్నాలు సినిమా అంతా ఫుల్ కామెడీగా ఉంటాయి. ఆ దెయ్యం ఆ హాస్టల్‌లోనే ఎందుకు ఉంది? దానికి తీరని కోరిక ఏంటి? ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకున్నారు? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×