Horror movie on OTT : సోషల్ మీడియా పిచ్చి రోజుకో తిక్క అన్నట్లుగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక హారర్ మూవీ ప్రేక్షకులను కుర్చీలాకే అతుక్కునేలా చేస్తోంది. నేటి తరం యువత సోషల్ మీడియా పిచ్చిని, మర్డర్ మిస్టరీతో సెటైరికల్ గా చూపించారు ఒక హాలీవుడ్ సినిమాలో. స్నేహితుల మధ్య ఉండే ఫేక్ బంధాలు, చిన్నపాటి అపార్థాలు ఎలా ప్రాణాంతకంగా మారుతాయో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. ఒక మాన్షన్ లో జరిగే మర్డర్ తో కథ పీక్స్ కి వెళ్తుంది. కిల్లర్ ఎవరనేది తెలిస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే. ఇందులో క్లైమాక్స్ ట్విస్ట్ అలా ఉంటుంది మరి.
ఈ అమెరికన్ బ్లాక్ కామెడీ స్లాషర్ చిత్రం పేరు Bodies Bodies Bodies. ఇందులో అమండ్లా స్టెన్‌బర్గ్, మారియా బకలోవా, పీట్ డేవిడ్సన్, రేచెల్ సెన్నాట్, లీ పేస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ A24 నిర్మించింది. వీళ్ళు విభిన్నమైన కథాంశాలకు హాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. కేవలం ₹25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹115 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా నేటి తరం యువత సోషల్ మీడియా పిచ్చిని సెటైరికల్ గా చూపిస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం చీకట్లో జరుగుతుంది కాబట్టి, రియలిస్టిక్ సీన్ల కోసం iPhone ఫ్లాష్‌లైట్లు, గ్లో స్టిక్స్ వెలుతురులోనే షూటింగ్ చేశారు. ఈ సినిమా ‘Independent Spirit Awards’లో ఉత్తమ తొలి స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకురాలు విభాగాల్లో నామినేషన్లు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ (Netflix) సబ్‌స్క్రిప్షన్ ద్వారా స్ట్రీమింగ్ చేయవచ్చు. Amazon Prime Video, ZEE5, YouTube, Google Play లో అద్దెకు కూడా తీసుకోవచ్చు.
ఒక రాత్రి భీభత్సమైన తుఫాను వస్తున్నప్పుడు, కొంతమంది రిచ్ కిడ్స్ ఒక పెద్ద విల్లాలో పార్టీ చేసుకుంటారు. అయితే సరదాగా గడపడానికి వాల్ల “బాడీస్ బాడీస్ బాడీస్” అనే మర్డర్ మిస్టరీ గేమ్ ఆడతారు. ఈ ఆటలో ఒకరు హంతకుడిగా నటించాలి, మిగిలిన వాళ్ళు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. కానీ ఆట మధ్యలో ఊహించని విధంగా వారిలో ఒకరు నిజంగానే శవమై కనిపిస్తారు. బయట తుఫాను వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి, లోపల కరెంట్ లేక చీకటిలో దారుణమైన పరిస్థితి. ఇక ఆ గ్రూపులోని స్నేహితుల మధ్య ఒకరిపై ఒకరికి అనుమానం మొదలవుతుంది. వాళ్ళ మధ్య ఉన్న పాత గొడవలు, అసూయలు అన్నీ బయటకు వస్తాయి. మనలోనే ఎవరో హంతకుడు ఉన్నాడనే భయంతో, ఆవేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటారు. చివరికి ఉదయం అయ్యాక అసలు నిజం బయటపడుతుంది. ఆ మొదటి వ్యక్తిని ఎవరూ చంపలేదని, కేవలం ఒక సోషల్ మీడియా వీడియో కోసం కత్తితో స్టంట్ చేస్తూ ప్రమాదవశాత్తు తన గొంతు తానే కోసుకున్నాడని తెలుస్తుంది. చిన్న అనుమానం వల్ల ప్రాణ స్నేహితులంతా ఒకరినొకరు చంపుకుని ఇందులో చివరకు ఇద్దరు మాత్రమే మిగులుతారు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు మజా మస్తు ఉంటుంది. వీకెండ్ ఓ సారి ట్రై చేసి చూడండి.
Read Also : కొరియన్ సినిమాలోనే మాస్టర్ పీస్ ఈ యాక్షన్ థ్రిల్లర్… ఏ ఓటీటీలో ఉందంటే ?