E-Paper
Advertisement

Daredevil Born Again Season 2 OTT : ‘డేర్ డెవిల్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీజన్ 2 అప్డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే ?

Daredevil Born Again Season 2 OTT : ‘డేర్ డెవిల్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీజన్ 2 అప్డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే ?
Advertisement

Daredevil Born Again Season 2 OTT : మార్వెల్ ఫ్యాన్స్‌కి మరో బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. డేర్‌డెవిల్: బార్న్ అగైన్ సీజన్ 2 ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ అయింది. ఓటీటీలోకి త్వరలో రాబోతోంది. సీజన్ 1 ఇంటెన్స్ హిట్ తో, సీజన్ 2ని చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. మార్వెల్ స్పాట్‌లైట్ బ్యానర్ కింద వస్తున్న ఈ సిరీస్ సూపర్‌హీరో ఫాటీగ్ లేకుండా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. టీజర్ కి కూడా విశేష స్పందన వస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొత్త సీజన్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. మరి ఇది ఏ ఓటీటీలో, ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘డేర్‌డెవిల్ బోర్న్ ఎగైన్ సీజన్ 2’లో ఈసారి కూడా 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఇది 2026 మార్చి 24 నుంచి JioHotstarలో అందుబాటులో ఉటుంది. మేయర్ విల్సన్ ఫిస్క్ ఏర్పాటు చేసిన ‘యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్’కు వ్యతిరేకంగా మాట్ మర్డాక్ చేసే పోరాటమే ఈ సీజన్ ప్రధాన కథాంశం. జెస్సికా జోన్స్, క్రిస్టెన్ రిట్టర్ తిరిగి ఈ పాత్రలో కనిపించబోతున్నారు. విల్సన్ బెథెల్ మరింత పవర్ ఫుల్ విలన్‌గా రాబోతున్నారు. మాట్ మర్డాక్ ఈసారి నలుపు రంగు సూట్ ధరించనున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే న్యూయార్క్‌లో పూర్తయింది. మార్వెల్ దీని తరువాత సీజన్ 3ని కూడా 2027లో తీసుకురావాలని చూస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి సీజన్ ముగిసిన తర్వాత, న్యూయార్క్ నగరం మేయర్ విల్సన్ ఫిస్క్ నియంతృత్వ పాలనలో చిక్కుకుంటుంది. ఫిస్క్ నగరంలో మార్షల్ లా విధించి, తనను ఎదిరించే విజిలెంట్లను వేటాడేందుకు ‘యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్’ను రంగంలోకి దింపుతాడు మేయర్. తన నగరాన్ని ఫిస్క్ అవినీతి సామ్రాజ్యం నుండి కాపాడుకోవడానికి డేర్‌డెవిల్ రహస్యంగా ఒక తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ పోరాటంలో మర్డాక్ తన పాత శత్రువులనే కాకుండా, తన గతాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ సీజన్‌లో మర్డాక్‌కు జెస్సికా జోన్స్, పనిషర్ వంటి శక్తివంతమైన మిత్రులు కూడా తోడవుతారు. విల్సన్ వ్యూహాలకు వ్యతిరేకంగా మాట్ మర్డాక్ ఒక టీం సిద్ధం చేసి, నగరాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఇక క్లైమాక్స్ లో డేర్‌డెవిల్, మేయర్ మధ్య ఒక మహా యుద్ధమే జరుగుతుంది. చివరికి ఈ యుద్దంలో ఎవరిది పై చేయి అవుతుందో తెలుసుకోవాలనుకుంటే, మరి కొద్ది రోజుల్లో రాబోతున్న ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : : తెలుగు నుంచి మలయాళం వరకు 4 రోజుల్లో 7 మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు… ఏ ఓటీటీలో ఏ మూవీ ?

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×