E-Paper
Advertisement

Horror film OTT : రివేంజ్ తీర్చుకోవడానికి వెళ్ళి అడ్డంగా ఇలా బుక్కయ్యారేంటి భయ్యా ? ఒళ్లు గగుర్పొడిచే సీన్స్

Horror film OTT : రివేంజ్ తీర్చుకోవడానికి వెళ్ళి అడ్డంగా ఇలా బుక్కయ్యారేంటి భయ్యా ? ఒళ్లు గగుర్పొడిచే సీన్స్
Advertisement

Horror film OTT: కొన్ని హారర్ సినిమాలలో హింస చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి కొన్ని సినిమాల మీద విమర్శలు కూడ వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ప్రపంచంలోనే అత్యంత భయానక చిత్రాల జాబితాలో కనిపిస్తుంది. సినిమాలో చూపించే హింస చాలా భయంకరంగా ఉండటంతో, దీనిని చాలా మంది విమర్శించారు కూడా. ఈ సైకలాజికల్ హారర్ చిత్రం ప్రతీకారం, ఆధ్యాత్మికత అనే రెండు అంశాల చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాని చూడలేక చాలా మంది మధ్యలోనే వచ్చేశారు. మరి ఈ సినిమాను మీరు కూడా చూడాలనుకుంటున్నారా ? అయితే ఒంటరిగా మాత్రం చూడకండి.

ఏ ఓటీటీలో ఉందంటే

2008లో పాస్కల్ లాజియర్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ హారర్ మూవీ పేరు (Martyrs) ‘మార్టిర్స్’. ఈ చిత్రంలో మోర్జానా అలౌయి, మైలీన్ జాంపనోయ్, కేథరీన్ బెగిన్ నటించారు. ఇది చిన్నతనంలో తనను హింసించిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే లూసీ అనే యువతి కథ. ఇది 2008లో ఫ్రెంచ్ ఫిల్మ్ మార్కెట్ మార్చే డు ఫిల్మ్‌లో మార్టిర్స్ ప్రదర్శించబడింది. అయితే అక్కడ దీని ఘోరమైన కంటెంట్ కారణంగా చలా మంది వాకౌట్‌ చేశారు. ఇక ఈ సినిమా అనేక చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన తర్వాత, ఇది 2008 సెప్టెంబర్ 3న ఫ్రాన్స్‌ థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా Apple tv +లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లూసీ అనే అమ్మాయిని చిన్నతనంలో కొందరు వ్యక్తులు బంధించి క్రూరంగా హింసిస్తారు. ఎలాగోలా తప్పించుకున్న లూసీ, 15 ఏళ్ల తర్వాత తన స్నేహితురాలు అన్నా సహాయంతో తనను హింసించిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే ఈ ప్రతీకార భాగంలో లూసీకి అన్నా తోడవుతుంది. వాళ్ళు అక్కడ ఒక భయంకరమైన రహస్య సంస్థ గురించి తెలుసుకుంటారు. ఆ సంస్థ యువతులను చిత్రహింసలకు గురిచేసి, వాళ్ళు మరణానికి ముందు చూసే మరణానంతర జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది.

అయితే ఈ సమయంలో అనుకోకుండా మళ్లీ వీళ్ళు ఆ సంస్థకు చిక్కుతారు. లూసీని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించిన తర్వాత, ఆమె ఒక అతీత స్థితికి చేరుకుంటుంది. చివరికి ఆమె ఆ సంస్థ నాయకురాలికి ఏదో రహస్యం చెబుతుంది. ఆమె ఏం చెప్పింది ? ఆ తరువాత ఏం జరిగింది ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  వింత మనిషి రాకతో వల్లకాడుగా మారే ఊరు… అంతుచిక్కని రోగంతో అలాడిపోయే జనం

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×