E-Paper
Advertisement

HP HyperX Omen 15: అడ్వాన్స్ ఫీచర్స్‌తో HP కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే

HP HyperX Omen 15: అడ్వాన్స్ ఫీచర్స్‌తో HP కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే
Advertisement

HP HyperX Omen 15| ల్యాప్‌టాప్స్ ప్రముఖ బ్రాండ్ అయిన హెచ్‌పి (HP) తాజాగా హైపర్‌ఎక్స్ ఓమెన్ 15 (HyperX Omen 15) అనే గేమింగ్ ల్యాప్‌టాప్ ఇండియాలో లాంచ్ చేసింది. గేమర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌ తయారు చేశారు. హెచ్‌పి కంపెనీ కొన్ని రోజుల క్రితం అమెరికాలో జరిగిన CES టెక్నాలజీ ఈవెంట్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను తొలిసారి ప్రదర్శించింది. హై-ఎండ్ పర్‌ఫామెన్స్, ఆధునిక గేమింగ్ ఫీచర్స్ ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది. గేమింగ్, స్ట్రీమింగ్, క్రియేటివ్ పనులకు బలమైన హార్డ్‌వేర్ ఇస్తుంది.

HP హైపర్‌ఎక్స్ ఓమెన్ 15 ధర, లభ్యత

భారతదేశంలో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ ధర రూ.1,49,999. ప్రీమియం షాడో బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా దీన్ని కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం లాంచ్ ఆఫర్లు ఏవీ ప్రకటించలేదు.

డిస్‌ప్లే ఫీచర్లు

Advertisement

ఈ ల్యాప్‌టాప్‌లో 15.3 ఇంచ్ WQXGA డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 2,560 x 1,600 పిక్సెల్స్. 180Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ గేమ్‌ప్లే ఇస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ వరకు ఉంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో వల్ల స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ-గ్లేర్ కోటింగ్, లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఎక్కువ సమయం గేమ్ ఆడినా కళ్లపై తక్కువ ఒత్తిడి ఉంటుంది.

ప్రాసెసర్, గ్రాఫిక్స్ పర్‌ఫామెన్స్

14th Generation ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్ ఉంది. ఇందులో 16 కోర్లు, 24 థ్రెడ్లు ఉన్నాయి. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా చేస్తుంది. Nvidia GeForce RTX 5060 ల్యాప్‌టాప్ GPU ఉంది. ఆధునిక గేమ్స్‌లో స్మూత్ ఫ్రేమ్ రేట్లు ఇస్తుంది. క్రియేటివ్ అప్లికేషన్లకు కూడా బాగా సరిపోతుంది.

కూలింగ్ సిస్టమ్, థర్మల్ మేనేజ్‌మెంట్

Advertisement

OMEN Tempest కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది ఎయిర్‌ఫ్లోను మెరుగుపరుస్తుంది, వేడిని త్వరగా తగ్గిస్తుంది. ఎక్కువ సమయం గేమ్ ఆడినా స్థిరమైన పర్‌ఫామెన్స్ ఉంటుంది. హెవీ లోడ్‌లో ఓవర్‌హీటింగ్ రాదు.

మెమరీ, స్టోరేజ్ ఆపరేటింగ్ సిస్టమ్

24GB RAM ఉంది. మల్టీటాస్కింగ్, డిమాండింగ్ అప్లికేషన్లకు సరిపోతుంది. 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అవసరమైతే స్టోరేజ్‌ను ఎక్స్‌పాండ్ చేయవచ్చు. విండోస్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

కీబోర్డ్, వెబ్‌క్యామ్, ఆడియో ఫీచర్లు

ఫుల్-సైజ్ కీబోర్డ్‌లో న్యూమరిక్ కీప్యాడ్ ఉంది. RGB బ్యాక్‌లైటింగ్‌తో గేమింగ్ లుక్ బాగుంటుంది. 1080p ఫుల్ HD వెబ్‌క్యామ్ HDR సపోర్ట్‌తో ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్లు స్పష్టమైన ఆడియో ఇస్తాయి. స్ట్రీమింగ్, వీడియో కాల్స్‌కు ఉపయోగపడతాయి.

Also Read: మహారాజుగా వస్త్రాలు ధరించే రోబో.. ప్రపంచంలోనే తొలి లగ్జరీ యంత్రం

కనెక్టివిటీ, పోర్టులు

Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉంది. రెండు USB Type-A పోర్టులు, ఒక USB Type-C పోర్టు ఉన్నాయి. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. హెడ్‌ఫోన్లు కనెక్ట్ చేయడానికి సౌలభ్యం.

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్, డిజైన్

70Wh బ్యాటరీ ఉంది. 30 నిమిషాల్లో 50 శాతం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 280W పవర్ అడాప్టర్ ఇస్తారు. ల్యాప్‌టాప్ సైజు 343 x 253 x 23.6 mm, బరువు సుమారు 2.21 కిలోగ్రాములు.
ఈ ల్యాప్‌టాప్ గేమర్లకు, కంటెంట్ క్రియేటర్లకు బాగా సరిపోతుంది. హై పర్‌ఫామెన్స్, మంచి డిస్‌ప్లే, బలమైన కూలింగ్ వల్ల ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు. ధర కొంచెం ఎక్కువ అయినా అడ్వాన్స్ ఫీచర్లకు తగిన ఇది ధరే.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×