E-Paper
Advertisement

Horror Movie OTT : వింత మనిషి రాకతో వల్లకాడుగా మారే ఊరు… అంతుచిక్కని రోగంతో అలాడిపోయే జనం

Horror Movie OTT : వింత మనిషి రాకతో వల్లకాడుగా మారే ఊరు… అంతుచిక్కని రోగంతో అలాడిపోయే జనం
Advertisement

Horror Movie OTT : ఎక్కున ఆసక్తిగా చూడాలనుకునే సినిమాలలో హారర్ జోనర్ కూడా ఒకటి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా కొరియన్ హారర్‌లో అత్యంత ప్రశంసలు పొందిన సినిమాల్లో కూడ ఒకటి. సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నిజమైన భయం ఏమిటో చూపిస్తుంది. రాత్రిపూట చూస్తే అస్సలు నిద్ర పట్టదు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? మరి తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉందంటే

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వైలింగ్’ (The Wailing). 2016లో వచ్చిన ఈ కొరియన్ సినిమాని నా హాంగ్-జిన్ తెరకెక్కించారు. క్వాక్ డో-వాన్, హ్వాంగ్ జంగ్-మిన్, చున్ వూ-హీ, జున్ కునిమురా ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఇది కొరియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన హారర్ మిస్టరీ థ్రిల్లర్లలో ఒకటిగా చెప్పుకుంటున్నారు. apple Tv +, Amazon Prime Videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

దక్షిణ కొరియాలోని ఒక మారుమూల గ్రామానికి ఒక వింత జపాన్ వ్యక్తి రాకతో కథ మొదలవుతుంది. అతను వచ్చిన కొద్దిరోజులకే ఆ గ్రామంలో మనుషులు వింత వ్యాధి బారిన పడి, తమ సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా హతమారుస్తుంటారు. ఈ మరణాలన్నీ ఏదో అడవి పుట్టగొడుగుల విషం వల్ల జరుగుతున్నాయని పోలీసులు భావిస్తారు. కానీ గ్రామస్థులు మాత్రం ఆ జపాన్ వ్యక్తి ఏదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, అతనే దీనికి కారణమని నమ్ముతారు. స్థానిక పోలీసు అధికారి జోంగ్-గూ ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో, తన కూతురు హ్యో-జిన్ కూడా అదే వింత వ్యాధికి గురై భయంకరంగా ప్రవర్తించడం చూసి తల్లడిల్లిపోతాడు.

పరిస్థితి విషమించడంతో, జోంగ్-గూ ఒక శక్తివంతమైన మంత్రగాడైన ఇల్-గ్వాంగ్‌ను పిలిపిస్తాడు. ఆ మంత్రగాడు గ్రామంలో ఉన్న చెడు శక్తిని వెళ్లగొట్టడానికి ఒక పెద్ద బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. కానీ ఆ సమయంలో జోంగ్-గూ కూతురు నరకయాతన అనుభవిస్తుంది. మరోవైపు, తెల్లటి దుస్తులు ధరించిన ఒక మహిళ గ్రామంలో తిరుగుతూ, ఆ జపాన్ వ్యక్తి అసలు రూపం దెయ్యమని జోంగ్-గూను హెచ్చరిస్తుంది. చివరికి ఆ జపాన్ వ్యక్తి, మంత్రగాడు, తెల్లటి దుస్తుల మహిళ గురించి కూడా అనుమానాలు వస్తాయి. వీరిలో ఎవరు దైవమో, ఎవరు దెయ్యమో అర్థం కాని స్థితిలో కథ క్లైమాక్స్ కి చేరుకుంటుంది. మరి ఈ క్లైమాక్స్ కి ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

Advertisement

Read Also : గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్… అంతలోనే అన్నోన్ డెలివరీ… కట్ చేస్తే ఫింగర్ కట్టయ్యే షాకింగ్ ట్విస్ట్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×