E-Paper
Advertisement

Horror Movie OTT: ఓటీటీలోకి మెల్ గిబ్సన్ హారర్ థ్రిల్లర్… స్కూల్ పిల్లలను భయపెట్టే భూతం… స్ట్రీమింగ్ తెలుగులో కూడా

Horror Movie OTT: ఓటీటీలోకి మెల్ గిబ్సన్ హారర్ థ్రిల్లర్… స్కూల్ పిల్లలను భయపెట్టే భూతం… స్ట్రీమింగ్ తెలుగులో కూడా
Advertisement

Horror Movie OTT : ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ఈ సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఒక హాలీవుడ్ మూవీ, పిల్లలు పెద్దలు కలసి చూసేలా రూపొందింది. ఈ సమ్మర్ లో ఇంట్లోనే ఈ సినిమాను చూస్తూ చిల్ అవ్వచ్చు. సినిమా అంతా 1990ల కాలంలో జరుగుతుంది. అప్పట్లో వాడిన సైకిళ్లు, బట్టలు, పాత కాలపు ఫోన్లు చూస్తుంటే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. ఈ కథ సమ్మర్ సెలవుల్లో పిల్లల వెంటపడే పడే ఒక రాకాసి చుట్టూ తిరుగుతుంది. ఇది స్కూల్ పిల్లల చుట్టూ సాగే ఒక హారర్ అడ్వెంచర్ మిస్టరీ. ఇది మరీ భయంకరమైన దెయ్యం సినిమా కాదు. పిల్లలు, ఫ్యామిలీ కలిసి చూసేలా ఒక గేట్‌వే హారర్ లా ప్లాన్ చేశారు.

జియో హాట్‌స్టార్‌ (Jio hotstar)లో స్ట్రీమింగ్

ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మాన్‌స్టర్ సమ్మర్’. ఇందులో హాలీవుడ్ లెజెండ్ మెల్ గిబ్సన్ ఒక రిటైర్డ్ డిటెక్టివ్‌గా మాస్ రోల్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద ప్లస్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది. మార్చి 20 నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌ (Jio hotstar)లో ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీభాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 1980ల నాటి క్లాసిక్ సినిమాలైన ‘ద గూనీస్’ (The Goonies) తరహాలో, పిల్లలు పెద్దలు కలిసి చూసేలా రూపొందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వేసవి సెలవుల్లో నోవా అనే కుర్రాడు, తన గ్యాంగ్‌తో కలిసి చిల్ అవుదామని ఒక దీవిలో ప్లాన్ చేస్తాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. ఊర్లో ఉన్న పిల్లలందరూ వింతగా ప్రవర్తిస్తూ, ఒంట్లో రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయి జోంబీల్లా మారిపోతుంటారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు, కానీ ఏదో ఒక దుష్ట శక్తి ఊర్లోకి వచ్చి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటోందని నోవాకు డౌట్ కొడుతుంది. ఎవరికి చెప్పినా నమ్మకపోవడంతో, నోవా ఆ ఊర్లోనే ఒంటరిగా ఉంటూ ఎవరితో కలవని ఒక ముసలి పోలీస్ ఆఫీసర్ జీన్ (మెల్ గిబ్సన్) దగ్గరకు వెళ్తాడు. మొదట్లో ఆ ముసలోడు విసుక్కున్నా, నోవా పట్టుదల చూసి సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. వీళ్లిద్దరూ కలిసి ఆ దుష్టశక్తి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ దుష్ట శక్తి పిల్లల ఆత్మలను పీల్చేసి వాళ్లను ఉత్స విగ్రహాల్లా మార్చేస్తుందని తెలుసుకుంటారు. ఇక లాభం లేదని నోవా, ఆ ముసలి డిటెక్టివ్ కలిసి ఆ రాక్షసి మీద పడతారు. తన ఫ్రెండ్స్‌ను కాపాడుకోవడానికి నోవా ప్రాణాలకు తెగించి ఆ దుష్ట శక్తిని ఎలా ఖతం చేశాడు ? ఆ ముసలి ఆఫీసర్ అతనికి ఎలా అండగా నిలబడ్డాడు అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : యమలోకం నుండి ఎస్కేప్… అమ్మాయి బాడీలోకి గ్యాంగ్ స్టర్… కామెడీతో కడుపునొప్పి తెప్పించే

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×