E-Paper
Advertisement

Fruits: రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!

Fruits: రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే!
Advertisement

Fruits: సాధారణంగా పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ.. మనం ఏ సమయంలో తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. చాలా మంది రాత్రి భోజనం తర్వాత లేదా పడుకునే ముందు పండ్లు తినడం అలవాటు చేసుకుంటారు. పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరాలే అయినప్పటికీ.. కొన్ని రకాల పండ్లను రాత్రి పూట తినడం వల్ల జీర్ణక్రియ మందగించడం, నిద్ర లేమి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి పూట అస్సలు తినకూడని ఆ పండ్లు ఏంటో.. వాటి వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రాత్రి పూట పండ్లు – ఆరోగ్య సూత్రాలు:
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం రెండు రకాల పండ్లు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. పండ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అయితే.. ఆయుర్వేదం, పోషకాహార నిపుణుల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరుగుతాయి.

Advertisement

1. పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 90% నీరు ఉంటుంది. పగటిపూట ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కానీ రాత్రి పూట తింటే.. ఇందులోని అధిక నీటి శాతం వల్ల మీరు మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మీ గాఢ నిద్రకు అంతరాయం కలుగుతుంది. అలాగే.. పుచ్చకాయలో ఉండే షుగర్ కంటెంట్ రాత్రి పూట జీర్ణం కావడం కష్టం.

2. అరటిపండు:
చాలా మంది రాత్రి పూట అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుందని అనుకుంటారు. కానీ.. మీకు జలుబు, దగ్గు లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉంటే రాత్రి పూట అరటిపండుకు దూరంగా ఉండటమే మంచిది. ఇది శరీరంలో శ్లేష్మాన్ని పెంచుతుంది. అలాగే అరటిపండులో క్యాలరీలు ఎక్కువ. ఇది రాత్రి పూట త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.

Advertisement

3. సిట్రస్ పండ్లు:
నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. అయితే వీటిలో.. ఉండే యాసిడ్ గుణాలు రాత్రి పూట కడుపులో మంటను కలిగిస్తాయి. పడుకున్నప్పుడు ఈ యాసిడ్ వెనక్కి తన్నడం వల్ల గుండెల్లో మంటగా అనిపించి నిద్ర పట్టదు.

4. మామిడి పండు:
మామిడి పండును పండ్ల రాజు అంటాం. కానీ ఇందులో షుగర్ , క్యాలరీలు చాలా ఎక్కువ. రాత్రి పూట మామిడి పండు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. ఫలితంగా మీకు నిద్ర పట్టకుండా చురుగ్గా అనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే.. వారు రాత్రి పూట మామిడి పండుకు దూరంగా ఉండాలి.

Also Read: పరగడుపున ఉసిరికాయ తింటే కలిగే.. అద్భుత ప్రయోజనాలు

5. జామ పండు:
జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకానికి మంచిదే కానీ.. రాత్రి పూట తింటే ఇందులోని గింజలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీని వల్ల కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పండ్లు తినడానికి బెస్ట్ టైం ఉదయం లేదా మధ్యాహ్నం. ఒకవేళ మీరు రాత్రి పూట పండ్లు తినాలనుకుంటే.. పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందే తినండి. కివీ లేదా చెర్రీస్ వంటి పండ్లు నిద్రకు సహాయ పడతాయి కాబట్టి వాటిని తక్కువగా తినాలి. కానీ పైన చెప్పిన పండ్లను మాత్రం రాత్రి పూట దూరం పెడితేనే మీ ఆరోగ్యానికి మంచిది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×