E-Paper
Advertisement

Horror Movie OTT: ఆడపిల్లలను బలి తీసుకునే ఇళ్ళు… గజ గజా వణికించే గజ్జెల దెయ్యం… ఒక్కో సీన్ చావు మేళమే

Horror Movie OTT: ఆడపిల్లలను బలి తీసుకునే ఇళ్ళు… గజ గజా వణికించే గజ్జెల దెయ్యం… ఒక్కో సీన్ చావు మేళమే
Advertisement

Horror Movie OTT : తాతల కాలంలో మనకు తెలిసిన దెయ్యాలు తెల్ల చీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని వస్తుంటాయి. అయితే కాలం మారిపోయింది. ఇప్పుడు వచ్చే దెయ్యాలు టెక్నికల్ దెయ్యాలు. చాలా భయంకరంగా ఉంటాయి. చూసే వాళ్ళకు సినిమా పూర్తి అయ్యేలోగా పడి సార్లు సుసూకి కూడా వెళ్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ మూవీ కూడా అలాంటిదే. ఇందులో దెయ్యాన్ని చూస్తే, వారం దాకా అస్సలు నిద్ర పట్టదు. మెక్సికో నుండి అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన అంబర్ అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తక్కువ ధరలో దొరికిందని ఒక పాత ఇంట్లో ఆమె అద్దెకు దిగుతుంది. ఆ తరువాత అసలు రచ్చ ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘నో వన్ గెట్స్ అవుట్ అలైవ్’ (No One Gets Out Alive). ఆడమ్ నెవిల్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను తీసిన శాంటియాగో మెన్ఘినికి ఇది మొదటి పెద్ద సినిమా. అంతకుముందు ఆయన చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు. ఇందులో క్రిస్టినా రోడ్లో (అంబర్), మార్క్ మెంచకా (రెడ్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాకు ‘బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్’లో బెస్ట్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేషన్ వచ్చింది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ లో వాచీ రాక్షసి డిజైన్ అందరినీ భయపెట్టింది. 2021లో వచ్చిన ఈ హారర్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మెక్సికో నుంచి అంబర్ అనే పిల్ల అమెరికాకు దొంగచాటుగా వలస వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో చిల్లిగవ్వ లేదు, పైగా ఉండటానికి ఇళ్ళు లేదు. ఎలాగోలా ఒక పాత కాలపు బిల్డింగ్‌లో తక్కువ రేటుకు రూమ్ దొరికితే అక్కడ దిగుతుంది. ఆ ఇంటి ఓనర్ రెడ్ అనేవాడు పైకి మంచివాడిలా కనిపిస్తాడు కానీ, వాడు అద్దెకు వచ్చే అమ్మాయిల మీద కన్నేసి ఉంచుతాడు. ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచీ అంబర్‌కు వింత వింత శబ్దాలు, ఎవరో ఏడుస్తున్నట్లు ఆకారాలు కనిపిస్తూ భయం పుట్టిస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఒక పెద్ద రాతి పెట్టె ఉంటుంది. దాని లోపల ఒక భయంకరమైన పురాతన కాలపు రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసికి అప్పుడప్పుడు ఆడపిల్లలను బలి ఇస్తేనే ఆ ఇంట్లోని మగవాళ్లకు ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తుందని వాళ్ళ నమ్మకం.

ఇక రెడ్, అతని తమ్ముడు కలిసి అంబర్‌ను కూడా ఆ రాక్షసికి బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలిసి ఆ ఇంటి నుంచి బయటపడదామని అంబర్ ఎంత ప్రయత్నించినా, ఆ మాయలో చిక్కుకుని బయటకు రాలేకపోతుంది. చివరికి ఆ రాక్షసి అంబర్‌ను కూడా పట్టుకుంటుంది. అయితే క్లైమాక్స్ ఊహించని భయంకరమైన టర్న్ తీసుకుంటుంది. ఆ మలుపు ఏమిటి ? ఆ రాక్షసి నుంచి ఆమె బయట పడుతుందా ? ఇంటి ఓనర్ల సంగతి ఏమిటి ? ఇంతకీ ఆ దెయ్యం వేటలో ఎవరు బలి అవుతారు ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×