E-Paper
Advertisement

Horror Movie OTT : వారంలో చంపేసే వీడియో టేప్… వింత శాపంతో వణుకు పుట్టించే హర్రర్ మూవీ

Horror Movie OTT : వారంలో చంపేసే వీడియో టేప్… వింత శాపంతో వణుకు పుట్టించే హర్రర్ మూవీ
Advertisement

Horror Movie OTT : ప్రపంచవ్యాప్తంగా హర్రర్ మూవీ లవర్స్ సంఖ్య భారీగా ఉందన్న విషయం తెలిసిందే. కాస్త కథ బాగుండి, భయపెట్టగలిగితే చాలు విశేష ఆదరణ దక్కుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇలాంటి సినిమాలను భయపడుతూనే ఆస్వాదిస్తారు. అలాంటి క్రేజీ హర్రర్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ భయంకరమైన మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? మూవీ పేరేంటి ? అనేది తెలుసుకుందాం పదండి.

ఫ్రీగానే స్ట్రీమింగ్

1998లో విడుదలైన ఈ జపనీస్ హారర్ మూవీ పేరు ‘రింగ్’ (Ring). హిరోషి టకెడా రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు హిదేయుకి కోజిమా ఈ చిత్రాన్ని అత్యంత భయానకంగా, సస్పెన్స్‌తో తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్‌ లోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. అమెరికాలో 2002లో దీనికి రీమేక్ గా (The Ring) వచ్చింది. ఒరిజినల్ జపనీస్ వెర్షన్ ఇప్పటికీ చాలా మందిని భయపెడుతూ ఉంటుంది. YouTubeలో పూర్తి సినిమా అందుబాటులో ఉంది. సుమారు 96 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను ఫ్రీగానే చూడవచ్చు. IMDbలో దీనికి 7.2 రేటింగ్ ఉండడం మరో విశేషం. సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ను ఇష్టపడే వాళ్ళు డోంట్ మిస్.

Advertisement

Also Read : ఒకే అమ్మాయితో ఏడుగురు… శవంతో కాపురం… రక్తాన్ని మరిగించి రివేంజ్ డ్రామా

కథలోకి వెళ్తే…

కథలో ప్రధాన పాత్ర పేరు రీకో అసకవ (నానాకో మత్సుషిమా). ఆ అమ్మాయి టీవీ రిపోర్టర్ గా పని చేస్తుంటుంది. ఆమె మేనల్లుడు టోమో (యూకో తకెడా) టీవీ చూసిన తరువాత భయంకరంగా చనిపోతాడు. కొన్ని రోజుల అతని మరణానికి కారణం ఒక వీడియో క్యాసెట్ అని తెలుస్తుంది. ఆ క్యాసెట్‌ ను చూసిన వ్యక్తి ఏడు రోజుల్లో చనిపోతాడు. మరణానికి ముందు ఫోన్‌ లో “ఏడు రోజులు” అనే మెసేజ్ వస్తుంది. రీకో ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది.

Advertisement

అతలోనే ఆమెకు తన కుమారుడు యోఇచి (రియో ఇషిబాషి) కూడా ఆ క్యాసెట్‌ ను చూసినట్లు తెలుస్తుంది. దీంతో కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో రీకో ఆ క్యాసెట్‌ ను చూస్తుంది. అందులో బావి, గుర్రం, అద్దం, ఒక అబ్బాయి వంటి సీన్స్ ఉంటాయి. కానీ ఆమెకు అదంతా చూశాక ఒక్క ముక్క కూడా అర్థం కాదు. క్యాసెట్ ముగిసిన తర్వాత ఫోన్ మోగుతుంది. “ఏడు రోజులు” అనే సందేశం వస్తుంది. ఇప్పుడు రీకోకి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఆలోగా ఆమె తన కుమారుడిని కాపాడాలని, ఈ క్యాసెట్ రహస్యాన్ని కనుగొనాలని డిసైడ్ అవుతుంది. ఆమె తన మాజీ భర్తు ర్యూజి (హిరోయుకి సనదా) సహాయం తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి ఆ క్యాసెట్ మూలాన్ని వెతుకుతారు. అది ఒక పాత బావి నుంచి వచ్చిన వీడియో అని తెలుస్తుంది. మరి ఆ బావికి, క్యాసెట్ కు ఉన్న లింకు ఏంటి ? దాన్ని చూసిన వాళ్ళు ఎందుకు 7 రోజుల్లో చనిపోతున్నారు ? చివరికి హీరోయిన్ తన కొడుకును కాపాడుకోగలిగిందా ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

 

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×