E-Paper
Advertisement

India vs Namibia: నేడే మ్యాచ్‌..నమీబియా కెప్టెన్ సీరియ‌స్‌ అస‌హ‌నం..ఓట‌మి భ‌యంతో త‌మ‌పై బీసీసీఐ కుట్ర‌లు !

India vs Namibia: నేడే మ్యాచ్‌..నమీబియా కెప్టెన్ సీరియ‌స్‌ అస‌హ‌నం..ఓట‌మి భ‌యంతో త‌మ‌పై బీసీసీఐ కుట్ర‌లు !
Advertisement

India vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్ జరగనుంది. నమిబియా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs Namibia) మధ్య బిగ్ ఫైట్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇండియా వర్సెస్ నమీబియా జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… నామీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ( Namibia captain Gerhard Erasmus)
చాలా సీరియస్ అయ్యారు. తమకు నైట్ ప్రాక్టీస్ చేసుకునేందుకు గ్రౌండ్ లో నెట్ ఏర్పాటు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. బిసిసిఐ, ఐసీసీ రెండు కూడా తమ జట్టు ప్రాక్టీస్ చేసుకునేందుకు స‌రైన‌ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇండియాతో రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. తమకు రాత్రిపూట ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ఇండియాకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించారని నిప్పులు చెరిగారు. ఓట‌మి భ‌యంతోనే ఇలా కుట్ర‌లు చేశార‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యానించాడు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

నమీబియా కెప్టెన్ సీరియ‌స్‌ ఎరాస్మస్ అస‌హ‌నం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో తమకు రాత్రిపూట మ్యాచ్ ఉన్నప్పటికీ.. ఉదయం నెట్ ప్రాక్టీస్ చేసుకునేలా మాత్రమే అవకాశం ఇచ్చారని.. మండిపడ్డారు గెర్హార్డ్ ఎరాస్మస్. కానీ ఇండియా జట్టుకు మాత్రం రాత్రిపూట ప్రాక్టీస్ చేసుకునేలా స్టేడియం లో ఏర్పాట్లు చేశారని బీసీసీఐ , ఐసీసీలపై ఫైర్ అయ్యారు. తమ జట్టుపై ఇంత కక్ష కట్టడం ఎందుకని నిలదీశారు. తమ చేతిలో ఇండియా ఓడిపోతుందనే భయంతో ఇలా చేశారని పరోక్షంగా ఆరోపణలు చేశారు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.

అసలు వాస్తవం ఏంటంటే ?

నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ చేస్తున్న ఆరోపణలపై ఐసీసీ కూడా స్పందించింది. ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. నవీబియా మేనేజ్మెంట్ రాత్రిపూట ప్రాక్టీస్ కోసం ముందుగా పర్మిషన్ తీసుకోవడంలో విఫలమైందని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి లోపు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఆ సమయంలోపు పర్మిషన్ తీసుకోలేదని వెల్లడించింది ఐసీసీ. దీంతో వేరే వాళ్లకు షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించింది. ఇది నమ్మిబియా తప్పిదం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ఇది ఇలా ఉండ‌గా ఢిల్లీలో ఇండియా vs నమీబియా మ‌ధ్య‌ మ్యాచ్‌కు ఇవాళ సాయంత్రం 7 గంట‌ల‌కు ఉండ‌నుంది. జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు.

Advertisement

Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×