Horror movie OTT : హారర్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే, ఈ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలను చూసే క్రేజీ అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమాలో వెయ్యేళ్ల నాటి మంత్రగత్తే, ఆత్మ రూపంలో ఒక మహిళ ఒంటిలో చేరుతుంది. ఆ తర్వాత సీన్స్ చాలా భయంకరంగా ఉండటమే కాకుండా, స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇది అవతార్ తర్వాత వరుసగా ఆరు వారాలు బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘ది రెచ్డ్’ (The Wretched). పియర్స్ బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్-పాల్ హోవార్డ్, పైపర్ కుర్దా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 జూలై 19న జరిగిన ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. 2020 మే 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ (Jio hotstar) లో అందుబాటులో ఉంది.
బెన్ అనే కుర్రాడి పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. దీంతో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి తండ్రి దగ్గరికి వస్తాడు బెన్ . అయితే పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఒక వింత సంఘటన జరుగుతుంది. ఒక పురాతనమైన దుష్ట శక్తి (మంత్రగత్తె) ఆ ఇంటి యజమానురాలు అబ్బీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది మామూలు దుష్ట శక్తి కాదు, వెయ్యేళ్ల నాటి మంత్రగత్తె ఆత్మ. రూపాలు మారుస్తూ చిన్న పిల్లలను మాయం చేస్తుంటుంది. మెల్లగా బెన్ ఆ పక్క ఇంట్లో ఏదో తేడా ఉందని గమనిస్తాడు. ఆ మంత్రగత్తె తన మాయతో పిల్లలను మింగేయడమే కాకుండా, వాళ్లు అసలు పుట్టనే లేదన్నట్టుగా వాళ్ల పేరెంట్స్ జ్ఞాపకాలను కూడా తుడిచేస్తుంది.
మరోవైపు తన పక్క ఇంట్లో పిళ్ళాడు మాయమైనా, ఆ బాబు తండ్రి మాత్రం నాకు అసలు కొడుకే లేడు అని చెప్పడం చూసి బెన్ షాక్ అవుతాడు. ఈ భయంకరమైన నిజాన్ని తన తండ్రికి చెప్పినా ఎవరూ నమ్మరు. పైగా బెన్‌ను ఏదో డ్రగ్స్ వాడుతున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటారు. చివరికి బెన్ ఒంటరిగానే ఆ రాక్షసి మీద యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. తన స్నేహితురాలు మల్లోరీ సాయంతో ఆ మంత్రగత్తె గుట్టు రట్టు చేసి, మాయమైన పిల్లలను ఎలా కాపాడాడు ? అనేది చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. సినిమాలో చివరి వరకు ఉండే సస్పెన్స్, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఆ చిన్న ట్విస్ట్ చూస్తే ఆడియన్స్‌కి గూస్ బంప్స్ వస్తాయి.
Read Also : 40 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు… అనేక అవార్డులు గెలుచుకున్న ఈ క్రేజీ మూవీ చూశారా?