E-Paper
Advertisement

Horror Movie OTT : భార్యను దెయ్యానికి తాకట్టు… రాత్రయితే రగడ… వణికిస్తున్న ఒక్కో సీన్

Horror Movie OTT : భార్యను దెయ్యానికి తాకట్టు… రాత్రయితే రగడ… వణికిస్తున్న ఒక్కో సీన్
Advertisement

Horror Movie OTT : ఇండోనేషియన్ సంప్రదాయాల్లోని క్షుద్ర పూజలు కూడా ఒక భాగమే. అక్కడి సినిమాలు కూడా ఎక్కువగా క్షుద్ర పూజల నేపథ్యంలోనే వస్తుంటాయి. వీటిని చూస్తుంటే ఒళ్ళు తనంతట తానే వణుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాంటి హారర్ మూవీ గురించే చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాను చాలా డార్క్ థీమ్‌లో తీశారు. ముఖ్యంగా హారర్ సీన్లు, లైటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయం పుట్టించేలా ఉంటాయి. ఇండోనేషియన్ చేతబడి ఎలా ఉంటుందో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫరా అనే యువతి చుట్టూ తిరిగే ఈ కథ ఆమె పెళ్లితో మొదలవుతుంది. ఆమె భర్త ఇచ్చే ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవుతుంది కూడా.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ హారర్ సినిమా పేరు ‘వనిత ఆహుతి నెరక’ (Wanita Ahli Neraka). ఫరీషాద్ లత్జుబా దర్శకత్వంలో ఇది రూపొందింది.
ఇందులో ఫెబ్బీ రాస్తాంతి, ఒక అంటారా, అషిరా జమితా ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 నవంబర్ 14లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. అయితే ఇది తెలుగు డబ్బింగ్‌లో కాకుండా ఇండోనేషియన్ భాషలోనే స్ట్రీమ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఫరా అని ఒక అమ్మాయి, చాలా పద్ధతిగా, భక్తితో పెరుగుతుంది. అయితే ఆ అమ్మాయికి వహాబ్ అనే ఒక పెద్ద రాజకీయ నాయకుడితో పెళ్లవుతుంది. వహాబ్ బయటకి చాలా మంచివాడిలా, భక్తిపరుడిలా కనిపిస్తాడు కానీ, లోపల మాత్రం పరమ కిరాతకుడు. తన రాజకీయ పదవుల కోసం, పవర్ కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే రకం అతను. ఫరా కూడా తన మొగుడు ఏదో పెద్ద తోపు అనుకుని తెగ నమ్మేసి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే సీన్ సితార అయిపోతుంది. వహాబ్ తన పవర్ కోసం ఒక దుష్ట శక్తితో డీల్ చేసుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం తన భార్యనే ఆ దయ్యానికి బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు.

మెల్లమెల్లగా ఫరాకి తన ఇంట్లో వింత వింత శబ్దాలు రావడం, ఎవరో తనను వెంటాడుతున్నట్టు అనిపించడం మొదలవుతుంది. తన మొగుడే తనను నరకానికి పంపే స్కెచ్ వేశాడని తెలిసి ఫరా షాక్ అయిపోతుంది. ఇక అక్కడి నుండి అసలైన రచ్చ మొదలవుతుంది. ఆ దయ్యం ఫరా మీద పడి నానా రకాలుగా హింసిస్తుంటే, మరోవైపు వహాబ్ తన పనిలో తను ఉంటాడు. క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. చివరికి ఈ దెయ్యాల నుండి, తన కసాయి మొగుడి నుండి ఫరా ఎలా తప్పించుకుంది? ఆ నరకం నుండి బయటపడిందా లేదా? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఆడపిల్లలను బలి తీసుకునే ఇళ్ళు… గజ గజా వణికించే గజ్జెల దెయ్యం… ఒక్కో సీన్ చావు మేళమే

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×