E-Paper
Advertisement

Psychological Thriller OTT : కసిగా నెత్తురు చిందించే సైకో పాప… క్షణ క్షణం ఉత్కంఠ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి

Psychological Thriller OTT : కసిగా నెత్తురు చిందించే సైకో పాప… క్షణ క్షణం ఉత్కంఠ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి
Advertisement

Psychological Thriller OTT : మైండ్ బెండ్ చేసే ఒక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొరియన్ థ్రిల్లర్ లో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇది 7 ఏళ్ల పాపతో మొదలవుతుంది. ఆ పాప అలాంటి, ఇలాంటి పాప కాదు. కత్తిపట్టే ఒక సైకో పాప. ఆడియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పాప, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు చెప్పాలి ఈ పాప గురించి. ఎందుకంటే ఈ సినిమాలో పాప చేసే పనులు అలా ఉంటాయి మరి. క్లైమాక్స్ మరింత కన్ఫూస్ గా ఉంటుంది సామి. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘సంబడీ’ (Somebody). కిమ్ యో-జియోంగ్, లీ జియోంగ్-చాన్ అనే ఇద్దరు దర్శకులు కలిసి ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. ఇందులో క్వాక్ సన్-యంగ్, క్వాన్ యు-రి, లీ సియోల్ లీడ్ రోల్స్ లో నటించారు.
ఇది 2024 అక్టోబర్‌లో బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ప్రస్తుతం ఈ సినిమా ‘ముబి’ (Mubi) ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యంగ్‌-యున్ అనే మహిళ ఒక స్విమ్మింగ్ కోచ్ గా ఉద్యోగం చేస్తుంటుంది. ఆమెకు ఏడేళ్ల కూతురు సో-హ్యూన్ ఉంటుంది. కానీ ఆ చిన్న పాపలో విపరీతమైన క్రూరత్వం, హింస కనిపిస్తాయి. ఆమె కళ్ల ముందే కుక్కను, పక్షులను దారుణంగా హింసించి చంపుతుంది కూతురు. తన కూతురు ఒక సైకోలా మారుతోందని, ఇతరులకు హాని చేస్తుందని ఆ తల్లి మనసులో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఆ పసి వయసులోనే ఆ పాప చేసే పనులు చూసి యంగ్‌-యున్ తట్టుకోలేకపోతుంది.

ఇప్పుడు కథ ఇరవై ఏళ్లు ముందుకు వెళ్తుంది. ఇప్పుడు సీన్‌లోకి మిన్ , హే-యంగ్ అనే ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వీళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ఉండే బంధం వెనుక ఏదో ఒక తెలియని రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో ఆ చిన్న పాపకు, ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది అసలు ట్విస్ట్. ఆ తల్లి భయపడినట్లే తన కూతురు ఒక కిల్లర్‌గా మారిందా? ఈ ఇద్దరు స్నేహితుల్లో సో-హ్యూన్ ఎవరు ? ఇంతకీ ఆమె తల్లి ఏమైంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : స్పృహ లేని అమ్మాయితో రచ్చ చేసే రాక్ స్టార్ … పెళ్లి అంటూ రాత్రికి రాత్రే పాడుపని

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×