E-Paper
Advertisement

పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తప్పిపోయిన సోదరి… యూట్యూబర్ తీసిన అద్భుతమైన హారర్ మిస్టరీ

పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ తప్పిపోయిన సోదరి… యూట్యూబర్ తీసిన అద్భుతమైన హారర్ మిస్టరీ
Advertisement

Horror Mystery Thriller OTT : పగలే భయం పుట్టించే హారర్ సినిమా చూడాలని ఉందా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా గురించి పక్కాగా చెప్పాలంటే, ఇది గజ గజ వణుకు పుట్టించే దెయ్యం సినిమా. చెల్లిని వెతుక్కుంటూ వెళ్లే ఒక అక్క కథ ఇది. ఏదో మామూలు దెయ్యంలా కాకుండా, పాత కాలపు వీడియో రికార్డింగులు, అడవుల్లో వింత శబ్దాలు, అస్సలు ఊహించని ట్విస్టులతో సినిమా అంతా భయం భయంగా సాగుతుంది. చిన్నప్పుడు మనం విన్న పిశాచి కథలు నిజమైతే ఎలా ఉంటుందో, అచ్చం అలానే ఈ సినిమాను చాలా సీరియస్‌గా, ఒళ్లు గగుర్పొడిచేలా తీశారు. దీనిని ఒక యూట్యూబర్ తెరకెక్కించడం విశేషం.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ సినిమా పేరు ‘షెల్బీ ఓక్స్’ (Shelby Oaks). ఈ సినిమా వెనుక ఉన్న అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించబడింది. ప్రముఖ యూట్యూబ్ ఫిల్మ్ క్రిటిక్ క్రిస్ స్టక్‌మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించగా, సుమారు 1.39 మిలియన్ డాలర్లు వసూలు అయ్యాయి. ఇది హారర్ సినిమాల చరిత్రలోనే అత్యధిక నిధులు సేకరించిన ప్రాజెక్ట్‌గా రికార్డు సృష్టించింది. హారర్ చిత్రాల దిగ్గజం మైక్ ఫ్లానాగన్ ఈ సినిమాకు అండగా నిలవడంతో పాటు ప్రముఖ సంస్థ NEON దీని పంపిణీ బాధ్యతలను తీసుకుంది. ఇందులో కామిల్లె సుల్లివన్, బ్రెండన్ సెక్స్టన్ III, మైఖేల్ బీన్, కీత్ డేవిడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జూలై 2024లో ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇది ప్రీమియర్ జరుపుకుంది. ఈ సినిమా ప్రస్తుతం హులు, జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

పన్నెండేళ్ల క్రితం ‘ది పారానార్మల్ పారానాయిడ్స్’ అనే ఒక యూట్యూబ్ టీమ్ దెయ్యాల వేటలో భాగంగా అడవికి వెళ్లి అదృశ్యమవుతుంది. ఆ టీమ్‌లో ఉన్న రైలీ అనే అమ్మాయి కూడా ఉంటుంది. తన సోదరి రైలీ కోసం మియా అనే మహిళ అప్పటినుంచి వెతుకుతూనే ఉంటుంది. పోలీసులు కేసు క్లోజ్ చేసినా, తన సోదరి బతికే ఉందన్న ఆశతో మియా తన సొంత ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ఒకరోజు రైలీకి సంబంధించిన ఒక పాత వీడియో టేప్ మియాకు దొరుకుతుంది. అందులో ఆ టీమ్ అదృశ్యం కావడానికి ముందు జరిగిన భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. ఆ ఆధారాలతో మియా ‘షెల్బీ ఓక్స్’ అనే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ విచారణ చేస్తున్న కొద్దీ తన సోదరి అదృశ్యం వెనుక ఏదో భయంకరమైన అతీంద్రియ శక్తి ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఆమె తన సోదరిని వెతికే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. చివరికి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మియా బయటపడిందా ? రైలీ మిస్సింగ్ ఎలా జరిగింది ? నిజంగానే దెయ్యం ఉందా ? అనే విషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కారణం లేకుండా మాయమయ్యే జనాలు… మిగిలిన వాళ్ళ పరిస్థితి ఘోరం… నరాలు తెగే ఉత్కంఠ

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×