Preity Zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament ) భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Punjab Kings vs Delhi Capitals, 55th Match) మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. 210 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్… విజయం వైపుగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కోనర్ ప్రీతి జింటా (Preity Zinta) డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. తలకు టోపీ పెట్టుకుని మెరిశారు. వైట్, బ్రౌన్ కాంబినేషన్ డ్రెస్ వేసిన ప్రీతి జింటా…. తలకు హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ పద్ధతిలో టోపీని ధరించి సందడి చేశారు. ఈ క్రమంలో ప్రీతి జింటా ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament ) భాగంగా ధర్మశాల లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (Himachal Pradesh Cricket Association Stadium, Dharamsala) వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 55వ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా డిఫరెంట్ గెటప్ లో సందడి చేశారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ సందర్భంగా తన భర్తతో కలిసి మ్యాచ్ తిలకించారు. హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ టోపీని ధరించి జట్టును ఎంకరేజ్ చేయడం జరిగింది.
ప్రీతి జింటా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె అక్కడి సాంప్రదాయ పద్ధతిలో కనిపించారు. హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ పద్ధతిలో భాగంగా టోపీని కూడా ధరించారు. ఇలా టోపీని ధరిస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని ప్రీతి జింటా బాగా నమ్ముతారట. ఆ సెంటిమెంట్ లో భాగంగానే తాజాగా టోపీ ధరించి స్టేడియంలో సందడి చేశారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 210 పరుగులు సాధించింది పంజాబ్ కింగ్స్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడుతోంది. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 130 పరుగులు సాధించింది. అక్షర పటేల్ అర్థ సెంచరీ తో రాణించాడు. అటు డేవిడ్ మిల్లర్ కూడా టచ్ లోకి వచ్చాడు. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.
Preity Zinta in the stands❤️🤗 pic.twitter.com/TpWtzYwcWy
— Rohshh45 (@rohitfc58737) May 11, 2026