E-Paper
Advertisement

Horror Series OTT : పెళ్లి వేడుకల్లో పిశాచాల గోల… ఆరు ఎపిసోడ్స్ తో ఊహించని ఉత్కంఠ

Horror Series OTT : పెళ్లి వేడుకల్లో పిశాచాల గోల… ఆరు ఎపిసోడ్స్ తో ఊహించని ఉత్కంఠ
Advertisement

Horror Series OTT : హారర్ సిరీస్ లు, సినిమాలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. మేకర్స్ సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అలాగే కొంచెం నచ్చినా కూడా ఈ కథలను ఎక్కడికో తీసుకెళ్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో వచ్చిన స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ సంచలనమే అయింది. ఇక దీనిని నిర్మించిన వాళ్లే మరో హారర్ స్టోరీతో ముందుకు వస్తున్నారు. ఇది కూడా ట్రెండింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ హారర్ మినీ సిరీస్ పేరు ‘సంథింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్’ (Something Very Bad Is Going To Happen). ఇందులో కామిలా మోరోన్, ఆడమ్ డిమార్కో ప్రధాన పాత్రల్లో నటించారు. జెన్నిఫర్ జాసన్ లీ, టెడ్ లెవిన్ వంటి ప్రముఖ హారర్ వెటరన్ నటులు కూడా ఇందులో ఉన్నారు. ‘స్ట్రేంజర్ థింగ్స్’ సృష్టికర్తలు డఫర్ బ్రదర్స్ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఇక రీసెంట్ హిట్టయిన ‘బేబీ రెయిన్ డీర్’ డైరెక్టర్ వెరోనికా టోఫిల్స్కా దీనికి దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ 2026 మార్చి 13న విడుదలైంది. మీరు దీన్ని యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి 2026, మార్చి 26న నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలవుతాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాచెల్ అనే అమ్మాయికి, నిక్కీ అనే కుర్రాడికి పెళ్లి ఫిక్స్ అవుద్ది. పెళ్లికి ముందు ఓ వారం రోజులు ఎంజాయ్ చేద్దామని, అందరూ కలిసి అడవిలో ఉన్న ఒక పాత కాలపు బంగ్లాకి వెళ్తారు. చుట్టూ మంచు, బయట ఎవరూ లేని ఆ ఏకాంతంలో పెళ్లి సంబరాలు మొదలవుతాయి. కానీ వెళ్లిన కొద్దిసేపటికే అక్కడ సీన్ రివర్స్ అవుద్ది. ఏదో ఒక తెలియని భయం, గాలిలో ఏదో కీడు ఉందన్న ఫీలింగ్ ఆ అమ్మాయికి మొదలవుతుంది. ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నారని, తన కాబోయేవాడి వెనుక ఏదో భయంకరమైన సీక్రెట్ ఉందని ఆమెకు అర్థమవుతుంది.

ఇక అసలు ఆట మొదలవుద్ది. ఆ బంగ్లాలో ఒక్కొక్కటిగా వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. నమ్మినోళ్లే దెయ్యాల్లా కనిపిస్తుంటే, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆ అమ్మాయికి పిచ్చెక్కిపోద్ది. ఏదో చాలా దారుణం జరగబోతోందని ఆమెకి లోపల గట్టిగా అనిపిస్తూనే ఉంటుంది. ఆ ఏడు రోజుల్లో ఆ పెళ్లి కూతురు ఆ నరకం నుండి ఎలా బయటపడింది? ఆ ఫ్యామిలీ దాస్తున్న ఆ రహస్యం ఏంటి? అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Advertisement

Read Also : Mystery Thriller Movie OTT: 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన తల్లి… అస్థిపంజరంతో అసలు గుట్టు… అదరగొట్టే మిస్టరీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×