E-Paper
Advertisement

మెదడు మొద్దుబారేలా చేసే తెలుగు హార్రర్ థ్రిల్లర్.. సింగిల్ గా చూశారో ఫసక్

మెదడు మొద్దుబారేలా చేసే తెలుగు హార్రర్ థ్రిల్లర్.. సింగిల్ గా చూశారో ఫసక్
Advertisement

Horror Thriller movie OTT : దెయ్యాల సినిమాలకు ప్రతి భాషలో క్రేజ్ ఉంటుంది. వీటిని చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ మాటల్లో చెప్పలేం. ఈ జానర్ సినిమాలు తెలుగులో కూడా క్రేజ్ పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది పక్కా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చిన సినిమా చూస్తే పిచ్చెక్కేలా ఉంటుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్మే ఒక యూట్యూబర్, ఒక పాత బంగ్లాలో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వెళ్లడం.. అక్కడ ఆమెకు ఎదురైన భయంకరమైన పరిస్థితుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కేవలం భయపెట్టడమే కాకుండా, ఈ సినిమాలో ఒక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కూడా ఉంది. ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఆ ఊరిలో జరుగుతున్న వింత మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది ఆసక్తికరంగా సాగుతుంది.

ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Aahwanam). ఈ చిత్రానికి జి.వి.కె (GVK) దర్శకత్వం వహించగా, లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కె.ఎస్. శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు నిర్మించారు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఉన్న తమియా హిల్స్, పాతాళ్‌కోట్ వంటి దట్టమైన అడవుల్లో జరిగింది. హారర్ ఫీల్ కోసం దర్శకుడు జి.వి.కె ఈ లొకేషన్లను ప్రత్యేకంగా ఎంచుకున్నారు. అలాగే సీనియర్ నటుడు శివ కంఠమనేని ఈ చిత్రంలో ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా సీరియస్‌గా కనిపిస్తారు. ఆయనతో పాటు ఎస్తేర్ నోరోన్హా, ధన్య బాలకృష్ణ వంటి నటీమణులు ఉండటం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాకు పద్మనాభ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హారర్ సన్నివేశాల్లో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 13 న థియేటర్లలో విడుదలైన తర్వాత Aha ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భార్గవి (సుప్రిత)కి సోషల్ మీడియాలో పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఒక సారి ఆమె చేసిన ఓ దెయ్యం వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన ఓ వ్యక్తి… అమరావతికి వచ్చి అక్కడ నిజంగా ఉన్న దెయ్యాలను లైవ్‌లో నిరూపించమని సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్‌తో భార్గవి తన బావ ఈశ్వర్ (శివ కంఠంనేని) తో సహా అమరావతికి వెళ్తుంది. ఈశ్వర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్. భార్గవి అక్కనే (ధన్య బాలకృష్ణ) అతను పెళ్లి చేసుకుని ఉంటాడు. భార్గవికి దెయ్యాలు అంటే అస్సలు నమ్మకం ఉండదు. అదంతా వట్టి భ్రమ అని నిరూపించాలని అనుకుంటుంది. అక్కడ ఉన్న ఒక పాత బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని అందరూ భయపడుతుంటారు, కానీ భార్గవి మాత్రం తన వ్యూవర్స్ కోసం అక్కడే మకాం వేసి అసలు నిజం ఏంటో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూపించాలనుకుంటుంది.

కానీ ఆ ఊరు వెళ్ళాక ఆమెకి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అప్పటి వరకు దెయ్యం లేదని వాదించిన భార్గవి, తన కళ్ల ముందే జరుగుతున్న భయంకరమైన సంఘటనలను చూసి వణికిపోతుంది. ఆ బంగ్లాకి, గతంలో జరిగిన కొన్ని దారుణమైన మరణాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది వీళ్ళు కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఆ గ్రామంలో ఒకప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న ఆత్మలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? వీళ్ళు క్షేమంగా అక్కడి నుంచి బయటపడతారా ? అనేదే మిగిలిన కథ.

Advertisement

Read Also : తీరని కోరికల వల్ల పుట్టిన సీక్రెట్ ఎఫైర్… రిటైర్డ్ అయినా తప్పని తిప్పలు… బాబోయ్ పిచ్చెక్కిస్తున్న సీన్లు

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×