E-Paper
Advertisement

PSL ఆడ‌టం దండ‌గ‌, అదో దిక్కుమాలిన టోర్న‌మెంట్, IPL వ‌దులుకుని త‌ప్పు చేశా

PSL ఆడ‌టం దండ‌గ‌, అదో దిక్కుమాలిన టోర్న‌మెంట్,  IPL వ‌దులుకుని త‌ప్పు చేశా
Advertisement

David Warner:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament ) పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్ లో అన్ సోల్డ్ ప్లేయర్లు, రిటైర్మెంట్ వయసుకు వచ్చినవాళ్లు… ఇలా చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నారు. అంటే అక్కరకు రాని ఆటగాళ్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇందులో భాగంగానే ఒకప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ లో వెలుగు వెలిగిన డేవిడ్ వార్నర్ కూడా, PSL టోర్నమెంట్ లోకి వెళ్ళిపోయాడు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (David Warner ), తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. PSL టోర్నమెంట్ అంటేనే చిరాకు దొబ్బిందని.. ఇదో దిక్కుమాలిన లీగ్ అంటూ సీరియస్ అయ్యారు. ఐపీఎల్ (IPL) టోర్నమెంట్ ను వదిలేసి తప్పు చేశానని బాంబు పేల్చారు డేవిడ్ వార్నర్. అంతేకాదు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో చోటు చేసుకుంటున్న వింత విశేషాలను పంచుకున్నారు.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

PSL ఆడ‌టం దండ‌గ‌, అదో దిక్కుమాలిన టోర్న‌మెంట్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో భాగంగా కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు డేవిడ్ వార్నర్. ఫస్ట్ వారంలో జట్టును బాగా లీడ్ చేసిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తర్వాత మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు డేవిడ్ వార్నర్. అయితే అప్పటికే లయ తప్పిన కరాచీ కింగ్స్ జట్టు.. ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పరువు తీసే వ్యాఖ్యలు చేశారు డేవిడ్ వార్నర్.

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ప్రతి ప్రెస్ మీట్ లో రిపోర్టర్లు చికాకు వచ్చేలా ప్రశ్నలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇదే తంతు జరుగుతోందని మండిపడ్డారు. తన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి కూడా విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇక టాస్ సమయంలో వింత ఫైటింగ్ సీన్లు పెడుతున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ జరుగుతుంటే… జెర్సీల.. కలర్ బంతులకు అంటుతోందని ఫైర్ అయ్యారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కింద విచిత్రమైన వస్తువులు అందిస్తున్నారని సెటైర్లు పేల్చారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తున్న PCB కూడా చెత్తగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మళ్లీ అవకాశం వస్తే తాను ఐపీఎల్ లోకి వస్తానని కూడా ప్రకటించారు.

Advertisement

 

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×