E-Paper
Advertisement

హత్య కేసులో బోలెడు అనుమానాలు… కూతురిని కూడా అనుమానించే తండ్రి… నరాలు తెగే ఉత్కంఠ

హత్య కేసులో బోలెడు అనుమానాలు… కూతురిని కూడా అనుమానించే తండ్రి… నరాలు తెగే ఉత్కంఠ

Psychological thriller OTT : కొన్ని సిరీస్ లు మైండ్ గేమ్ తో మెంటలెక్కిస్తుంటాయి. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ను కన్ఫ్యూస్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కంటెంట్ ను ప్రేక్షకులు కూడా ఇంట్రస్ట్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సిరీస్ బుర్రకు బాగా పదును పెడుతుంది. ఇందులో ఒక పోలీస్ కూతురు, ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. సొంత కూతురు క్రిమినల్ అని తెలిసి ఆ తండ్రి షాక్ అవుతాడు. అయితే ఇన్వెస్టిగేషన్ లో ఒక్కో సీన్ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు సిసలైన సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఇదీ అనిపిస్తుంది మీరు కూడా దీనిని చూస్తే.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘డౌట్’ (Doubt). 2024లో వచ్చిన ఈ సిరీస్ లో హాన్ సుక్-క్యూ (తండ్రి పాత్ర), చే వోన్-బిన్ (కూతురు పాత్ర)లో నటించారు. ముందుగా ఈ కథ 2021లో జరిగిన MBC డ్రామా స్క్రిప్ట్ పోటీలో విజేతగా నిలిచింది. దీనిని తెరపైకి తీసుకురావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. సుమారు 9.6 బిలియన్ కొరియన్ వాన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్, ప్రారంభంలో తక్కువ రేటింగ్స్‌తో మొదలైనప్పటికీ, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే కారణంగా చివరి ఎపిసోడ్ నాటికి 9.6% రేటింగ్‌ను సాధించి పెద్ద హిట్ అయింది. అవార్డుల పరంగా కూడా ఈ సిరీస్ సత్తా చాటింది. ఇటాలియన్ గ్లోబల్ సిరీస్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ డ్రామా’గా నిలవడమే కాకుండా, నటుడు హాన్ సుక్-క్యూ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. అలాగే, గ్రిమే అవార్డ్స్ 2024లో ఉత్తమ దర్శకత్వం, ఎడిటింగ్, నటనతో సహా ఐదు కీలక విభాగాల్లో అవార్డులను అందుకుని అత్యుత్తమ కొరియన్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ Netflix, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

జాంగ్ టే-సూ అనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఎంత తోపు అంటే, ఎక్కడ ఏ నేరం జరిగినా క్రిమినల్ మైండ్ సెట్‌ను ఇట్టే కనిపెట్టేస్తాడు. అయితే ఊరందరికీ నీతులు చెప్పే ఈ పోలీసోడికి తన కూతురు హా-బిన్ ప్రవర్తన చూస్తేనే పెద్ద డౌట్ కొడుతుంటుంది. ఆ పిల్ల సైలెంట్‌గా ఉంటూనే ఏదో గూడుపుఠాణి చేస్తూ ఉంటుంది. తనకి ఇష్టమైన వాళ్లందరినీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న ఈ తండ్రికి, తన సొంత కూతురే ఒక పెద్ద పజిల్‌లా మారుతుంది. ఒకరోజు ఒక దారుణమైన మర్డర్ కేసు టే-సూ దగ్గరికి వస్తుంది. ఆ కేసును డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ అతని గుండె ఆగిపోయినంత పని అవుతుంది.

ఎందుకంటే ఆ మర్డర్ జరిగిన చోట దొరికిన ఆధారాలన్నీ తన కూతురి వైపు చూపిస్తాయి. బయటి వాళ్లకైతే ఇది జస్ట్ కేసు, కానీ అతనికి అది తన రక్తం. నా కూతురు ఇంత పని చేసే సీన్ ఉందా? లేక ఎవడైనా ఇరికించాలని చూస్తున్నాడా? అని అతను పిచ్చెక్కిపోతుంటాడు. ఇప్పుడు అతను అటు ఆఫీసులో అందరికీ అనుమానం రాకుండా కేసు డీల్ చేయాలి, ఇటు ఇంట్లో కూతురు చేస్తున్న వింత పనుల వెనుక ఉన్న నిజం కనిపెట్టాలి. ఆ పిల్ల నిజంగానే మర్డర్ చేసిందా ? లేక ఆమె కూడా బాధితురాలా? అనే సస్పెన్స్‌తో కథ పీక్స్‌కి వెళ్తుంది. తండ్రీకూతుళ్ల మధ్య జరిగే ఈ మైండ్ గేమ్ మామూలుగా ఉండదు. చూసే వాళ్ళకి కూడా పిచ్చెక్కిపోద్ది.

Read Also : కిల్లర్ వలలో చిక్కుకున్న ఒంటరి అమ్మాయి… రాత్రంతా పరుగులు పెట్టించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×