E-Paper
Advertisement

Horror Thriller OTT : మూడు ముఖాలతో ఉన్న వింత జీవి… ప్రేమ పేరుతో ప్రాణాలు తీసే పిశాచి… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు

Horror Thriller OTT : మూడు ముఖాలతో ఉన్న వింత జీవి… ప్రేమ పేరుతో ప్రాణాలు తీసే పిశాచి… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు
Advertisement

Horror Thriller OTT : హర్రర్ సీన్లు అంటే హాలీవుడ్ అన్నట్టుగా ఉంటాయి. ఒక్కో స్టోరీ ఎంత డిఫరెంట్ గా ఉంటుందంటే కలలో కూడా అలాంటి కథలను ఊహించలేము మనము. అలాంటి ఓ వింత స్టోరీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ పేరేంటి ? స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘కీపర్’ (Keeper). 2025లో వచ్చిన ఈ అద్భుతమైన హర్రర్ మూవీని లాంగ్‌లెగ్స్, ది మంకీ ఫేమ్ డైరెక్టర్ ఓస్గుడ్ పెర్కిన్స్ తెరకెక్కించారు. నిక్ లెపార్డ్ స్క్రిప్ట్ అందించారు. కాస్ట్నియాన్ బ్యానర్‌పై రిలీజ్ అయిన ఈ మూవీలో టటియానా మాస్లానీ, రాసిఫ్ సదర్లాండ్ ప్రధాన పాత్రలు పోషించారు. సపోర్టింగ్‌ రోల్స్ లో బిర్కెట్ టర్టన్, ఎడెన్ వైస్ తదితరులు నటించారు. 1 గంట 39 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ లేదా బై ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  బ్యాంక్ సేఫ్ ను బద్దలు కొట్టడానికి మైండ్ బెండింగ్ ప్లాన్… వీడి ధైర్యానికి దండం పెట్టాలి భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

లిజ్ (టటియానా మాస్లానీ), మాల్కమ్ (రాసిఫ్ సదర్లాండ్) అనే ప్రధాన పాత్రధారుల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇద్దరూ డేటింగ్ మొదలు పెట్టి ఒక సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఈ వన్ ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుని, ఒక తీపి జ్ఞాపకంగా మలుచుకోవాలని అనుకుంటారు. అందులో భాగంగా ఈ స్పెషల్ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీకి దూరంగా ఉన్న, ఒక మారుమూల క్యాబిన్‌ కి వెళ్తారు. రొమాంటిక్ వీకెండ్ ప్లాన్ చేస్తారు.

Advertisement

కానీ మాల్కమ్ సడన్‌ గా ప్లాన్ ను పక్కన పెట్టి, అర్జెంట్ పని అంటూ ఆమెను అక్కడే వదిలేసి సిటీకి వెళ్లిపోతాడు. లిజ్ ఆ అడవిలో ఒంటరిగా మిగిలిపోతుంది. సింగిల్ గా ఈ హాలీడేని ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది. కానీ అంతలోనే క్యాబిన్‌ లో వింతవింత సంఘటనలు జరగడం మొదలవుతుంది. ఒక భయంకరమైన సీన్ ఒకటి కన్పిస్తుంది. దీంతో ఆమె మెంటల్ గా డౌన్ అయ్యి కుంగిపోతుంది. ఈ నేపథ్యంలోనే క్యాబిన్ పాస్ట్ కు సంబంధించిన హాంటింగ్ సీక్రెట్స్ బయట పడతాయి. మరి ఆ సీక్రెట్స్ ఏంటి ? ఎందుకు హీరో హీరోయిన్ ను అక్కడే వదిలేసి వెళ్ళాడు ? ఆమెకి కన్పించిన ఆ వింత ఆకారం ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×