E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను కలిసిన అమర్

Nindu Noorella Saavasam Serial Today January 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను కలిసిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మిస్సమ్మ హైదరాబాద్‌ వచ్చిందన్న రాథోడ్‌ మాటలకు పిల్లలు ఎగిరి గంతేస్తారు. సంతోషంతో డాన్స్‌ చేస్తుంటారు. మనోహరి, చంభా మాత్రం షాక్‌ అవుతారు. మిస్సమ్మ తిరిగి వస్తుందనే భయంతో వణికిపోతుంటారు. ఇక పిల్లలు పైకి రాథోడ్‌ భయటకు వెళ్లిపోతారు. దీంతో చంభా మనోహరి దగ్గరకు వెళ్లి మనోహరి నేను చెప్పాను కదా నీకు చెడు రోజులు మొదలవబోతున్నాయి అని చెప్పగానే.. మనోహరి కోపంగా చంభాను చూస్తుంది. పైకి రూంలోకి వెళ్లిన పిల్లలు హ్యాపీగా ఉంటారు. మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తున్నారు ఐదేళ్ల తర్వాత హమ్మయ్యాఅంటుంది అమ్ము.. అంజు కూడా ఇక నువ్వు హాస్టల్ కు నేను కొడైకెనాల్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు అమ్ము అని చెప్తుంది.

కింద ఉన్న చంభా ఇప్పటికైనా నా మాట నమ్ముతావా మనోహరి అంటుంది. నేను చెప్పేది నిజమని ఒప్పుకుంటావా..? అంటుంది. పైన రూంలో ఆనంద్‌ కూడా మేము కూడా డెహ్రాడూన్‌ వెళ్లం ఇక్కడే ఉంటాం.. అని చెప్తాడు. అవును బెటర్‌ మనం వెళ్లక ముందే మిస్సమ్మ, బుజ్జమ్మ వచ్చారని తెలిసింది మనకు మళ్లీ హ్యాపీడేస్‌ మొదలయ్యాయి అంటాడు ఆకాష్‌.. మనోహరి ఆ పిల్ల జన్మించినప్పుడే నీ మృత్యువు ఈ భూమి మీద అడుగుపెట్టిందని నాకు అర్థం అయింది మనోహరి. ఇక నువ్వు ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి మనోహరి అంటూ చంభా హెచ్చరిస్తుంది. దీంతో మనోహరి మనసులో బిడ్డతో హైదరాబాద్‌ వచ్చిన భాగీ ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్లినట్టు అని ఆలోచిస్తుంది. వెంటనే అమర్‌ రూం దగ్గరకు వెళ్తుంది. బయటే నిలబడి లోపల అమర్‌ రాథోడ్‌తో మాట్లాడుతుంటే వింటారు చంభా, మనోహరి. లోపల రాథోడ్‌ సార్‌ మీతో చెప్పుకోలేని కారణం అయ్యుంటుంది సార్‌ అనగానే.. అమర్‌ కోపంగా రాథోడ్‌ నాతో చెప్పుకోలేని కారణం ఉందంటే.. అది తనకు నాకు మధ్య దూరం ఉందని అర్థం అందుకే తను నన్ను విడిచి దూరంగా వెళ్లిపోయింది అని అమర్‌ చెప్పగానే..

Advertisement

లేదు సార్‌ మిస్సమ్మకు మీరంటే ఎంతో ప్రేమ గౌరవం.. పమీ పెళ్లి అయ్యాక మీకు దగ్గర అవ్వాలని  మిస్సమ్మ ఎంతలా ప్రత్నించారో నాకు తెలుసు.. సార్‌.. అలాంటిది మిస్సమ్మ మిమ్మల్ని దూరం చేసుకుంటుందా..? అని చెప్పగానే.. ఇప్పుడు దూరం చేసుకుందిగా.. ఐదేళ్లుగా దూరంగానే ఉంది కదా..? అని చెప్పగానే.. దీంతో రాథోడ్‌ పోనీ నేను ఒక్కడినే అరకు వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసి వస్తాను సార్‌ అంటాడు. దీంతో అమర్‌ కోపంగా నువ్వు కూడా అరకు వెళ్లి ఎంక్వైరీ చేయకు.. రాథోడ్‌ ఇట్స్‌ మై ఆర్డర్‌.. నాకు తెలియకుండా నువ్వు తన గురించి ఎంక్వైరీ  చేశావో నా గురించి నీకు బాగా తెలుసు రాథోడ్‌.. అని చెప్తాడు.అంతా విన్న చంభా, మనోహరి అక్కడి నుంచి హాల్లోకి వెళ్తారు. మనోహరి, అమరేంద్ర మంచి పని చేశాడు. భాగీ గురించి తను వెతకడమే కాదు రాథోడ్‌ ను కూడా వెతకొద్దు అంటున్నాడు అని చంభా చెప్పగానే.. అమర్‌ వెతక్కపోయినా.. రాథోడ్ వెతక్కపోయినా మనం భాగీని వెతకాలి చంభా అని చెప్పగానే.. చంభా షాకింగ్‌ గా ఏ ఎందుకు అని అడుగుతుంది.

దీంతో మనోహరి మనం పెట్టిన భయంతో అది పారిపోయింది. ఈ అయిదేళ్లు అజ్ఞాతంలో ఉంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఏడేళ్ల గడువులో ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే అది తిరిగి వచ్చింది. ఏ ధైర్యంతో తిరిగి వచ్చిందో దాన్ని నడిపిస్తున్న ధైర్యం ఏంటో నాకు తెలియాలి. ఆ పిల్లతో నాకు ప్రాణగండం అని చెప్పావు.. దాని అడుగు మళ్లీ ఈ ఇంట్లో పడకూడదు.. భాగీ తిరిగి ఈ ఇంటికి రాకూడదు.. అంటుంది. దీంతో చంభా భాగీ ఇంటికి వచ్చేదే అయితే ఈ పాటికి వచ్చేదే కదా..? తను ఎటో వెళ్లిపోయిందని రాథోడ్‌ చెప్పాడు కదా..? ఒకవేళ భాగీ బిడ్డతో ఇంటికి వచ్చినా అమరేంద్ర రానిచ్చేలా లేడు కదా..? అంటుంది చంభా.. దీంతో మనోహరి నవ్వుతూ పిచ్చి చంభా నువ్వు అమర్‌లో పైకి కనిపించే కఠినత్వమే చూస్తున్నావు.. కానీ తన మనసులో అరుందతిపైన భాగీపైన ఆ బిడ్డపైన ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు..? వాళ్లు రానంత వరకే అమర్‌ రాయిలా ఉంటాడు.. వాళ్లు వచ్చాక వెన్నలా కరిగిపోతాడు.. అందుకే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్లను మట్టుబెట్టాలి.. అని చెప్పగానే.. చంభా అర్థమైంది మనోహరి కానీ ఇంత పెద్ద సిటీలో వాళ్లు ఎక్కడున్నారని వెతకాలి అని అడుగుతుంది.  దానికి ఒక దారి ఉంది అదేంటో చెప్తాను పదా అంటూ ఇద్దరూ కలిసి లోపలకి వెళ్లిపోతారు.

Advertisement

తర్వాత అమర్‌, రాథోడ్‌ కలిసి అంజును తీసుకుని స్కూల్‌కు వెళ్తారు అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతుంటే.. అటెండర్‌ వచ్చి ఎవరో కొత్త అడ్మిషన్‌ కోసం వచ్చారని చెప్తాడు. ఎవరు ప్రిన్సిపాల్‌ అని అడగ్గానే.. ఎవరో అరుంధతి అంట మేడం అని చెప్తాడు అటెండర్‌. వాళ్లను కొద్దిసేపు వెయిట్‌ చేయమని చెప్పు అంటుంది ప్రిన్సిపాల్‌. అరుందతి అని పేరు వినగానే ముగ్గురు ఎమోషనల్‌ ఫీలవుతారు. వెంటనే అమర్‌ మేడం మేము వెయిట్‌ చేస్తాం.. మీరు మాట్లాడండి అని చెప్తాడు. దీంతో అటెండర్‌ బయటకు వెళ్లి బుజ్జమ్మను ప్రిన్సిపాల్‌ రూంలోకి తీసుకొస్తాడు. బుజ్జమ్మను చూసి అమర్‌ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×