Horror Thriller Movie on OTT : ఓటీటీలో ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా ఊహించని ట్విస్ట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇది పైకి పక్కా రక్తం చిందే సైకో సినిమా లాగా కనిపిస్తూనే, లోపల మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చే ఒక విభిన్నమైన సైకో హారర్ థ్రిల్లర్. సినిమా మొదలవ్వడమే దట్టమైన అడవి, సమ్మర్ క్యాంప్, గొడ్డలి పట్టుకుని పిల్లల్ని వేటాడే కిల్లర్ అంటూ 1980ల కాలం నాటి పాత దెయ్యం సినిమాల లుక్‌తో ఫుల్ గా భయపెడుతుంది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి అసలు సీన్ రివర్స్ అయిపోతుంది. డైరెక్టర్ ఇచ్చే గట్టి షాక్ కి అందరికీ ఫ్యూజులు పోతాయి. మరి ఆ ట్విస్టులు ఏమిటి ? దీని పేరు ? ఏ ఓటీటీలో చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే..
2025లో విడుదలైన ఈ అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘మార్ష్‌మల్లో’ (Marshmallow). ఈ సినిమా 2025 ఏప్రిల్ 11 న థియేటర్లలో విడుదలైంది. డానియల్ డెల్‌పుర్గాటోరియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జార్జియా విఘామ్, కోర్బిన్ బెర్న్‌సెన్, కుయ్ లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Shudder, Paramount+ లలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే YouTube Movies లో రెంట్ చెల్లించి కూడా డిజిటల్ వెర్షన్‌ను వీక్షించవచ్చు. ఈ సినిమాకు వచ్చిన డిజిటల్ వ్యూస్ ఆధారంగా, దీనికి ఒక సీక్వెల్ (Marshmallow Part 2) కూడా ప్రకటించారు.
ఈ సినిమా అంతా అడవి ప్రాంతంలో ఉన్న ఒక సమ్మర్ క్యాంప్ చుట్టూ తిరుగుతుంది. మోర్గాన్ అనే పన్నెండేళ్ల చిన్న పిల్లోడు తన తాత చనిపోయిన బాధలో, విపరీతమైన భయాలు, టెన్షన్లతో ఈ క్యాంప్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ క్యాంప్ లీడర్ ఈ అడవుల్లో “ది డాక్టర్” అనే ఒక సైకో ఉన్నాడని, వాడు దొరికినోడిని దొరికినట్టు నరికేస్తాడని భయపెడతాడు. అతను చెప్పినట్టే రాత్రి పూట క్యాంప్ చుట్టూ వింత వింత శబ్దాలు రావడం, ఎవడో పక్కనే ఉన్నట్టు అనిపించడంతో పిల్లలకి ప్యాంట్ తడిసిపోతుంది.
అక్కడ ఎవడో గొడ్డలి పట్టుకుని పిల్లల్ని వేటాడటం మొదలుపెడతాడు. ఇదో రొటీన్ నరకుడు సినిమా అనుకుంటే అక్కడే డైరెక్టర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే అదంతా ఒక పెద్ద హైటెక్ సెటప్. ఆ క్యాంప్‌కి వచ్చిన పిల్లలెవ్వరూ నిజమైన మనుషులు కారు. వాళ్లంతా ఎప్పుడో చచ్చిపోయిన పిల్లల డిజిటల్ బొమ్మలు. చనిపోయిన పిల్లల జ్ఞాపకాలతో బతుకుతున్న తల్లిదండ్రుల ఆనందం కోసం ఒక కంపెనీ ఈ మాయా ప్రపంచాన్ని సృష్టించింది.
కానీ మోర్గాన్‌కి తను నిజంగానే చనిపోయిన పాత జ్ఞాపకాలు కొద్దికొద్దిగా గుర్తొస్తాయి. చివర్లో అక్కడ పనిచేసే ఒక ఆఫీసర్ మోర్గాన్‌కి, వాడి ఫ్రెండ్ పిల్లార్‌కి ఒక ఛాయిస్ ఇస్తాడు. ఇదే మాయ ప్రపంచంలో బతుకుతారా? లేక ఇదంతా వదిలేసి బయటపడతారా? అని అడుగుతాడు. వాళ్లు ఏం డిసైడ్ అయ్యారనేది చూపించకుండా సినిమాను కాస్త సస్పెన్స్ గా ముగిస్తారు.
Read Also : ప్రతీ ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్… పక్కా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇవి చూడాల్సిందే