E-Paper
Advertisement

వణికిస్తున్న వింత రూపం… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఫ్యామిలీ… భయం ఉన్నోళ్లు చూడకూడని సినిమా

వణికిస్తున్న వింత రూపం… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే ఫ్యామిలీ… భయం ఉన్నోళ్లు చూడకూడని సినిమా
Advertisement

Horror Thriller Movie OTT :హారర్ సినిమాల కథలు ఎక్కువగా మారుమూల ప్రాంతాలలో, పాడుబడిన ఇళ్ళల్లో జరుగుతుంటాయి. ఇక ఈ సినిమాలను చూసే ఆడియన్స్ కూడా ఎక్కువే. ఇంట్లోనే కూర్చుని ఎక్కువగా ఈ సినిమాలనే చూస్తూ ఎంటర్టైన్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఒక హారర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను అమెరికాలోని వర్మాంట్ అనే పల్లెటూరి ప్రాంతంలో ఉన్న ఒక పాత ఇంట్లోనే షూట్ చేశారు. ఈ మూవీలో దయ్యం అకస్మాత్తుగా వచ్చి భయపెట్టడం కంటే, గదిలో ఒక మూలనో, కిటికీ దగ్గరో కదలకుండా కూర్చుని కనిపించే తీరు ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తుంది. విమర్శకులు కూడా ఈ సినిమాలో హారర్‌తో పాటు, తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను బాగా మెచ్చుకున్నారు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘ది విచ్ ఇన్ ది విండో’ (The Witch in the Window). దర్శకుడు ఆండీ మిట్టన్ కేవలం దర్శకత్వమే కాకుండా, ఈ సినిమాకు కథ, ఎడిటింగ్, సంగీతం అందించడం వంటి పనులన్నీ తనే చూసుకున్నారు. ఇందులో అలెక్స్ డ్రేపర్, చార్లీ టాకర్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా అయినప్పటికీ, సాధారణ హారర్ సినిమాల్లాగా కేవలం చీకట్లో కాకుండా, పగటి వెలుతురులోనే వింతైన శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం Shudder, Apple TV, Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సైమన్ అనే ఒక తండ్రి, తన 12 ఏళ్ల కొడుకు ఫిన్ ను తీసుకొని వర్మాంట్ అనే ఊరికి వస్తాడు. అక్కడ పాతబడిపోయిన ఒక పెద్ద ఇంటిని కొని, దాన్ని రిపేర్ చేసి కొత్తగా మార్చాలని వాళ్ల ప్లాన్. అలా ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ కాస్త ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటారు. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి వాళ్లకి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఇదివరకు లిడియా అనే మహిళ ఉండేది. ఊర్లో వాళ్లందరూ ఆమెను ఒక మంత్రగత్తె అని పిలిచేవారు. ఆమె ఆ ఇంట్లోనే ఒక కిటికీ దగ్గర కూర్చుని చనిపోయింది. సైమన్ తన కొడుకుతో కలిసి ఇంటికి రిపేర్లు చేస్తున్న కొద్దీ, చనిపోయిన ఆ లిడియా ఆత్మ మళ్ళీ బ్రతికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

అక్కడ వాళ్ళు ఇంటిని ఎంత బాగు చేస్తుంటే, ఆమె అంత బలంగా తయారవుతూ వాళ్ళని భయపెట్టడం మొదలుపెడుతుంది. ఆ ఆత్మ నుండి తన కొడుకును కాపాడుకోవడానికి సైమన్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ దయ్యం ప్రభావం వాళ్ళ మీద బాగా పడిపోతుంది. చివరికి తన కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం సైమన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. గూస్ బంప్స్ అయితే వస్తాయి ఈ క్లైమాక్స్ చూస్తే. చివరికి సైమన్ తన కొడుకును కాపాడుకున్నాడా ? అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి ? ఆ దెయ్యాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ? అసలు ఆమె ఎలా చనిపోయింది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ప్రెగ్నెన్సీ తెచ్చిన పెద్ద చిక్కు… పైసా కోసం పడరాని పాట్లు… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×