E-Paper
Advertisement

Horror Thriller OTT: శవానికి ముద్దులు… అర్దరాత్రి దాటాక ఆ పని… ఒళ్లు గగుర్పొడిచే ముగింపు

Horror Thriller OTT: శవానికి ముద్దులు… అర్దరాత్రి దాటాక ఆ పని… ఒళ్లు గగుర్పొడిచే ముగింపు
Advertisement

Horror Thriller OTT : షార్ట్ ఫిలిం తీయడానికి ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. వీటితో తమలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతున్నారు. తక్కువ బడ్జెట్ తో వీటిని తీసి తమలో ఉన్న కోరికను తీర్చుకోగలుగుతున్నారు. ఇలాంటి కొన్ని సినిమాలు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందుతున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ ఒక హారర్ కంటెంట్ తో వచ్చింది. ఇది బాగా పాపులర్ కూడా అయింది. ఒక మృతదేహాల గదిలో పనిచేసే వ్యక్తి, అక్కడ ఉన్న ఒక యువతి మృతదేహం పట్ల వింతగా ప్రవర్తిస్తాడు. ఆ తరువాత ఊహించని భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇది ఒక్క సారి చూస్తే భయంతో వణికిపోతారు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

యూట్యూబ్ (YouTube)లో స్ట్రీమింగ్

ఎల్వుడ్ క్విన్సీ వాకర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ షార్ట్ ఫిలిం పేరు ‘Kissed’. 2020లో తెరకెక్కిన ఇది కేవలం 6 నిమిషాల నిడివితో మాత్రమే ఉంటుంది. ఈ సినిమాను మీరు యూట్యూబ్ (YouTube) ఛానెల్‌లో ఉచితంగా చూడవచ్చు. ఈ చిత్రం భయంకరమైన క్లైమాక్స్, మేకప్ ఎఫెక్ట్స్ ద్వారా మంచి గుర్తింపు కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నార్మన్ అనే ఒక వృద్ధుడు మృతదేహాలను భద్రపరిచే చోట పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక అందమైన యువతి మృతదేహం అక్కడికి వస్తుంది. ఆ శవం పట్ల నార్మన్ చాలా వింతగా, అసహ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఆమెకు మేకప్ వేస్తూ, నగలు పెడుతూ ఆ శవం తనతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు. చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవం లేకుండా, తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆ మృతదేహంతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కథ చివరిలో నార్మన్ ఆ శవానికి ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఆ మృతదేహం ఒక్కసారిగా కళ్ళు తెరిచి నార్మన్‌ను గట్టిగా పట్టుకుంటుంది. అతను చేసిన తప్పుకు ఆ శవం అతన్ని తనతో పాటు లాక్కెళుతుంది. చనిపోయిన వారిని అవమానిస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ చిత్రం ఒక అతీంద్రియ శక్తి కోణంలో చూపిస్తుంది.

Read Also :  ఆస్కార్ వేడుకలో మమ్ముట్టి హర్రర్ మూవీ హవా… ఇండియాలో ఒక్క హీరో కూడా సాధించలేని రికార్డు మావా… మీరు ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×