E-Paper
Advertisement

దేవుడి గుడిలో దెయ్యాల సంత… గుండె బద్దలయ్యే క్లైమాక్స్

దేవుడి గుడిలో దెయ్యాల సంత… గుండె బద్దలయ్యే క్లైమాక్స్
Advertisement

Horror thriller OTT హారర్ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమా కేవలం భయపెట్టడమే కాకుండా, ఒక మంచి కథను కూడా కలిగి ఉందని అందరూ మెచ్చుకున్నారు.
ఈ కథ ఒక అమెరికన్ యువతి సన్యాసినిగా మారడానికి రోమ్‌లోని ఒక కాథలిక్ అనాథాశ్రమానికి వెళ్తుంది. అక్కడ చర్చిలో భయంకరమైన కుట్రను ఆమె గుర్తిస్తుంది. ఆ తరువాత సినిమా మామూలుగా ఉండదు. చూసినోళ్ళే వణికిపోతున్నారు.

జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘ది ఫస్ట్ ఒమెన్’ (The First Omen). ఇది 1976లో వచ్చిన క్లాసిక్ హారర్ చిత్రం ‘ది ఒమెన్’ కు ప్రీక్వెల్. దీనికి అర్కాషా స్టీవెన్సన్ దర్శకత్వం వహించారు. ఇది ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ, హారర్ సీన్లను చాలా భయంకరంగా తీశారని విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇందులో ప్రధాన పాత్రలో నెల్ టైగర్ ఫ్రీ నటించగా, బిల్ నైఘీ, రాల్ఫ్ ఇనెసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. ఇది ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరవ చిత్రం. హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మార్గరెట్ అనే అమెరికన్ యువతి క్రైస్తవ సన్యాసిని (నన్) అవ్వాలనే కోరికతో రోమ్‌లోని ఒక అనాథాశ్రమానికి వస్తుంది. అక్కడ చేరిన కొత్తలో అంతా ప్రశాంతంగానే ఉన్నట్టు అనిపించినా, నెమ్మదిగా అక్కడ జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఆమెను భయపెడతాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక అమ్మాయి విషయంలో ఏదో కీడు జరగబోతోందని ఆమెకు అర్థమవుతుంది. నిజానికి చర్చిలోని ఒక వర్గం వాళ్ళు ప్రజల్లో దేవుడి పట్ల భక్తి తగ్గకుండా చూడాలని ఒక భయంకరమైన ప్లాన్ వేస్తారు. లోకంలో కీడును సృష్టించే సాతాను బిడ్డను పుట్టించడం ద్వారా, ప్రజలు భయంతో మళ్లీ చర్చిని ఆశ్రయిస్తారని వాళ్ళు నమ్ముతారు. ఆ కుట్రలో భాగంగానే మార్గరెట్‌ను అక్కడికి రప్పించారని, ఆమె చుట్టూ ఒక పెద్ద వల అల్లారని చివరకు బయటపడుతుంది. ఈ క్రమంలో మార్గరెట్ తనను తాను ఎలా కాపాడుకుంది? ఆ సాతాను బిడ్డ పుట్టుకను ఆపగలిగిందా ? అనేది మిగిలిన కథ. 1976లో వచ్చిన అసలు ‘ఒమెన్’ సినిమాలోని సాతాను పుట్టుకకు గల కారణాలను ఈ సినిమా చాలా ఉత్కంఠభరితంగా చూపిస్తుంది.

Read Also : సిటీ అంతా శవాల దిబ్బ… ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న మృత్యువు… గుండె దడ పెంచే సిరీస్

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×