E-Paper
Advertisement

సిటీ అంతా శవాల దిబ్బ… ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న మృత్యువు… గుండె దడ పెంచే సిరీస్

సిటీ అంతా శవాల దిబ్బ… ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న మృత్యువు… గుండె దడ పెంచే సిరీస్
Advertisement

Horror Thriller OTT: హారర్ థ్రిల్లర్ సిరీస్ లు ఇచ్చే థ్రిల్ మరెందులోనూ దొరకదు. ఇందులో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సిరీస్ లను క్లైమాక్స్ వరకు కళ్లార్పకుండా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ కొరియన్ సిరీస్ ఓటీటీలో అదరగొట్టింది. దీనిని ఆడియన్స్ కూడా క్రేజీగా చూశారు. ఈ కథ ఒక నగరంలోని ఒక పెద్ద గోతి నుండి నల్లటి పొగ వస్తుంది. ఆ పొగను పీల్చిన మనుషులు వింత జీవులుగా మారిపోయి దాడి చేస్తుంటారు. ఈ విపత్తు నుండి ప్రజలు ఎలా బయట పడ్డారన్నదే స్టోరీ. ఇందులో వెన్నులో వణుకు పుట్టించే సీన్లు చాలానే ఉన్నాయి. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘డార్క్ హోల్’ (Dark Hole). 2021లో వచ్చిన ఈ సిరీస్ కొరియాకు చెందిన ప్రముఖ ఛానెల్ OCN ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందింది. అంటే ఒక సినిమాకు ఉండే హై-క్వాలిటీ విజువల్స్, మేకింగ్‌ను ఒక టీవీ సిరీస్‌గా అందించడం దీని ప్రత్యేకత. ఈ సిరీస్ ఎంతటి గుర్తింపు పొందిందంటే, దీని కథాంశంతో ఒక ప్రత్యేకమైన వెబ్‌టూన్ కూడా విడుదల చేశారు. నటీనటుల విషయానికి వస్తే, ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన కిమ్ ఓక్-బిన్, లీ జూన్-హ్యూక్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా వింత జీవులుగా మారే మనుషుల మేకప్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయి. ప్రస్తుతం ఈ సిరీస్ Rakuten Viki లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో, అలాగే MX Player వంటి వేదికల్లో హిందీ డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ముజి అనే నగరంలో అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. దాని నుంచి ఒక వింతైన నల్లటి పొగ బయటకు వస్తుంది. ఆ పొగను పీల్చిన మనుషులు ఒక్కసారిగా భయంకరమైన రాక్షసుల్లా మారిపోతారు. వాళ్ల కళ్లు నల్లగా మారిపోయి, ఒంట్లో రక్తం గడ్డకట్టి, ఎదురుగా ఉన్న మనుషులపై పిచ్చిగా దాడి చేయడం మొదలుపెడతారు. నగరం మొత్తం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఈ గందరగోళం మధ్యలో లీ హ్వా-సున్ అనే ఒక పోలీస్ డిటెక్టివ్ తన భర్తను చంపిన హంతకుడిని వెతుక్కుంటూ ఈ నగరానికి వస్తుంది. అక్కడ ఆమెకు యూ టే-హాన్ అనే మాజీ పోలీస్ పరిచయమవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ వింత పొగ బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకుంటూ, మిగిలిన ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులు ఎప్పుడు రాక్షసుల్లా మారిపోతారో తెలియని భయానక పరిస్థితుల్లో వీరు పోరాడాల్సి వస్తుంది. అసలు ఆ పొగ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆ గొయ్యిలో ఏదైనా వింత శక్తి ఉందా? అనే విషయాలతో క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా ఉంటుంది.

Read Also : ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×