E-Paper
Advertisement

నిద్రలేని రాత్రులు మిగిల్చే అత్యంత భయంకరమైన హారర్… చూస్తే చలి జ్వరం గ్యారంటీ

నిద్రలేని రాత్రులు మిగిల్చే అత్యంత భయంకరమైన హారర్… చూస్తే చలి జ్వరం గ్యారంటీ
Advertisement

Horror Thriller OTT : హారర్ సినిమాలు అంటేనే భయంకరంగా ఉంటాయి. దెయ్యాలు, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో ఇవి ఆడియన్స్ కు వణుకు పుట్టిస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది చూస్తున్నంత సేపు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా ఉంది. 2020లో జరిగిన ఒక సైంటిఫిక్ రీసర్చ్ ప్రకారం, హారర్ సినిమాలు చూసేటప్పుడు ప్రేక్షకుల హార్ట్ రేటు ఎంత పెరుగుతుందో లెక్కించారు. ఆ పరిశోధనలో ఈ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం అందరి హార్ట్ రేట్ వేగంగా పెరగడంతో, దీనిని సైంటిఫిక్‌గా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమాగా గుర్తించారు.

ఎక్కడ చూడచ్చు అంటే

2012లో వచ్చిన ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘సినిస్టర్’ (Sinister). ఇది స్కాట్ డెరిక్సన్ దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం. స్కాట్ డెరిక్సన్ తనకు వచ్చిన ఒక భయంకరమైన పీడకల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. ప్రధాన పాత్రలో నటించిన ఈథన్ హాక్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కేవలం ₹25 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹730 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇది ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టివిలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఎలిసన్ ఒక క్రైమ్ నవలా రచయిత. ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్న అతను, మళ్ళీ అలాంటి సక్సెస్ కోసం వెతుకుతుంటాడు. ఈ సమయంలో గతంలో ఒక కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఇంటికి తన భార్యాపిల్లలతో కలిసి మారతాడు. ఆ ఇంట్లో జరిగిన నేరం గురించి తన పుస్తకంలో రాయాలని అతను భావిస్తాడు. కానీ ఆ విషయం తన కుటుంబానికి చెప్పకుండా దాచిపెడతాడు. అయితే ఒక రోజు ఆ ఇంటి అటకపై ఎలిసన్‌కు కొన్ని పాత వీడియోలు దొరుకుతాయి. వాటిని చూసినప్పుడు, కొన్ని కుటుంబాలు ఎలా హత్య చేయబడ్డాయో అందులో రికార్డ్ అయి ఉంటుంది. వీటిని చూసి ఎలిసన్ షాక్ అవుతాడు.

అంతేకాకుండా ఆ వీడియోలను గమనించినప్పుడు, అన్నింటిలోనూ ఒక వింతైన, భయంకరమైన ముఖం కనిపిస్తుంది. అది ‘బుగూల్’ అనే ప్రాచీన దుష్టశక్తి అని, అది తన తర్వాతి లక్ష్యంగా ఎలిసన్ కుటుంబాన్ని ఎంచుకుందని అతనికి మెల్లగా అర్థమవుతుంది. ఇక సినిమా చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. ఆ వీడియోల్లో ఉన్న హత్యలన్నీ ఆయా కుటుంబాల్లోని చిన్న పిల్లలే చేసి ఉంటారు. బుగూల్ ఆ పిల్లల మనసులను మార్చి, వాళ్ళ చేతే కుటుంబాన్ని అంతం చేయిస్తాడు. చివరికి ఎలిసన్ ఫ్యామిలీ కూడా ఆ దుష్ట శక్తికి బలి అవుతుందా ? దీని నుంచి వీళ్ళు బయట పడతారా ? అనేది ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దైవ నిర్ణయమా? డెవిల్స్ వేటనా? ప్రాణం తీసే వింత పిలుపు… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×