E-Paper
Advertisement

పన్నెండేళ్ల క్రితం మాయమైన చెల్లి కోసం అక్క పోరాటం… థియేటర్లలో అలరించిన ‘షెల్బీ ఓక్స్’ ఇప్పుడు ఓటీటీలో

పన్నెండేళ్ల క్రితం మాయమైన చెల్లి కోసం అక్క పోరాటం… థియేటర్లలో అలరించిన ‘షెల్బీ ఓక్స్’ ఇప్పుడు ఓటీటీలో
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ కథలో చెల్లెలి మిస్సింగ్ మిస్టరీ కోసం, ఒక అక్క భయంకరమైన వేట మొదలుపెడుతుంది. ఇది కేవలం దెయ్యం సినిమా మాత్రమే కాదు, ఒక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కూడా. పాత కెమెరా వీడియోల ద్వారా కథను నడిపిస్తూ, నిజంగానే మన పక్కన ఏదో జరుగుతుందనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఈ సినిమా చివర వరకు ఒక రకమైన టెన్షన్‌ని, భయాన్ని మెయింటైన్ చేస్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మంచి మజా ఇచ్చే సినిమా ఇది.

హులు (Hulu) ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ మూవీ పేరు ‘షెల్బీ ఓక్స్’ (Shelby Oaks). ప్రముఖ యూట్యూబ్ మూవీ క్రిటిక్ క్రిస్ స్టక్‌మాన్ తన కలల ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు. కేవలం అభిమానుల నుండే ‘కిక్‌స్టార్టర్’ ద్వారా దాదాపు ₹11.5 కోట్లకు పైగా నిధులు సేకరించి, అత్యధిక విరాళాలు పొందిన హారర్ చిత్రంగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ సినిమాను అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ముఖ్యంగా ఇందులోని జైలు సన్నివేశాలను ‘ఒహియో స్టేట్ రిఫార్మేటరీ’ లో షూట్ చేశారు. ఇదే జైలులో గతంలో సూపర్ హిట్ మూవీ ‘ది షాశాంక్ రిడంప్షన్’ ను కూడా తీశారు. ఇందులో కామిల్లె సుల్లివన్, సారా డర్న్, బ్రెండన్ సెక్స్టన్ III, కీత్ డేవిడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా 2026 ఏప్రిల్ 17 నుండి హులు (Hulu) ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

‘పారానార్మల్ పారనాయిడ్స్’ అనే ఒక యూట్యూబ్ గ్రూప్, దెయ్యాలు ఉంటాయని నమ్మే ప్రాంతాలను షూట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఒక పాడుబడ్డ జైలుకు వెళ్ళినప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అడ్రస్ లేకుండా మాయమైపోతారు. ఆ బృందంలో రైలీ అనే అమ్మాయి కూడా ఉంటుంది. అప్పటి నుండి ఆమె అక్క మియా, తన చెల్లెలు ఏమైపోయిందో తెలియక తీవ్రమైన మనోవేదన అనుభవిస్తూ, తన కోసం వెతుకుతూనే ఉంటుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆ గ్రూప్ షూట్ చేసిన కొన్ని పాత వీడియో క్లిప్పింగ్స్ మియాకి దొరుకుతాయి.

అయితే  ఆ వీడియోలను జాగ్రత్తగా గమనిస్తే, తన చెల్లెలి మాయం వెనుక ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందని ఆమెకు అర్థమవుతుంది. అది తన చిన్నతనంలో తను భయపడిన ఒక దుష్టశక్తి అని తెలుసుకుని మియా షాక్ అవుతుంది. ఆ క్లూస్ పట్టుకుని చెల్లెలి ఆచూకీ కోసం ఆమె ఒంటరి పోరాటం మొదలుపెడుతుంది. అసలు ఆ పాడుబడ్డ జైలులో ఆ రాత్రి ఏం జరిగింది? తన చెల్లెలు ఇంకా బతికే ఉందా? మియా ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తుంది ? ఆ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొంటుంది? అనే విషయాలతో సినిమా భయంకరమైన మలుపులు తిరుగుతుంది.

Advertisement

Read Also : ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×