E-Paper
Advertisement

పరాయి స్త్రీ కోసం పరితపించే రక్త పిశాచి… వణుకు పుట్టిస్తున్న వింత స్టోరీ

పరాయి స్త్రీ కోసం పరితపించే రక్త పిశాచి… వణుకు పుట్టిస్తున్న వింత స్టోరీ
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో హారర్ సినిమాలకు కొదవలేదు. అలాగే వాటిని చూసేటోళ్లు కూడా తక్కువేం లేరు. ఈ నేపథ్యంలో గత ఏడాది వచ్చిన హారర్ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ప్రేక్షకుల నుంచి. ఇది ఒక భయంకరమైన రక్త పిశాచి చుట్టూ తిరుగుతుంది. ఇందులో అకస్మాత్తుగా భయపెట్టే సీన్ల కంటే, 19వ శతాబ్దం నాటి పాత కోటలు, కొవ్వొత్తుల వెలుతురులో షూట్ చేసిన సీన్లు, సినిమాకు ఒక రకమైన క్లాసిక్ ఇంకా భయంకరమైన ఫీల్‌ని ఇస్తాయి. అంతేకాదు ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నోస్ఫెరాటు’ (Nosferatu). ఈ సినిమా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఇది 1922లో వచ్చిన ‘నోస్ఫెరాటు’ సినిమాకు అధికారిక రీమేక్. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కథను ఇప్పటి టెక్నాలజీతో, మరింత భయంకరంగా తెరకెక్కించారు. ఈ సినిమాను దర్శకుడు రాబర్ట్ ఎగ్గర్స్ అద్భుతంగా తెరకెక్కించారు. 19వ శతాబ్దం నాటి వాతావరణం తీసుకురావడానికి సెట్స్‌లో లైట్లు వాడకుండా, కేవలం కొవ్వొత్తుల కాంతితోనే షూటింగ్ చేశారు. విలన్ ‘కౌంట్ ఓర్లాక్’ పాత్ర కోసం నటుడు బిల్ స్కార్స్‌గార్డ్ ప్రతిరోజూ ఆరు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. ఇందులో ఆయన నటన. రూపం ఎంత భయంకరంగా ఉంటాయంటే, షూటింగ్ సమయంలో తోటి నటీనటులు కూడా ఆయనను చూసి నిజంగానే భయపడేవారట. 2025 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటి విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5, JioHotstar ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

19వ శతాబ్దంలో థామస్ హట్టర్ అనే వ్యక్తి ఆస్తి అమ్మకం విషయంలో కౌంట్ ఓర్లాక్ అనే జమీందార్‌ని కలవడానికి ట్రాన్సిల్వేనియా వెళ్తాడు. అక్కడకు వెళ్ళాక కానీ అతనికి అర్థం కాదు, ఆ ఓర్లాక్ ఒక భయంకరమైన రక్తపిశాచి అని. హట్టర్ భార్య ఎలెన్ ఫోటో చూసిన ఓర్లాక్, ఆమెపై వ్యామోహంతో ఆమెను దక్కించుకోవడానికి జర్మనీ బయలుదేరుతాడు. ఓర్లాక్ జర్మనీకి వచ్చేటప్పుడు తనతో పాటు ప్లేగు వ్యాధిని, వేల సంఖ్యలో ఎలుకలను తీసుకొస్తాడు. వాడు ఊర్లోకి అడుగుపెట్టగానే జనం పిట్టల్లా రాలిపోతుంటారు. మరోవైపు ఎలెన్‌కు తన భర్త ఆపదలో ఉన్నాడని, ఆ రాక్షసుడు తన కోసమే వస్తున్నాడని వింత వింత కలలు వస్తూ మానసిక వేదనకు గురవుతుంది. ఆ రక్తపిశాచిని ఆపాలంటే ఒక స్త్రీ తనను తాను బలి ఇచ్చుకోవాలని ఎలెన్ తెలుసుకుంటుంది. ఇక క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉటుంది. చివరికి రక్తపిశాచిని ఎలెన్ అంతం చేస్తుందా ? దాని అంతం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మైండ్ బ్లాకయ్యే హత్యలు… ఐయండిబిలో 8 రేటింగ్ తో వెన్నులో వణుకు పుట్టించే క్లైమాక్స్

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×