E-Paper
Advertisement

రక్తం చూస్తే వణికిపోయే డాక్టర్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్

రక్తం చూస్తే వణికిపోయే డాక్టర్… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్
Advertisement

Comedy Series OTT : ఓటీటీలో రీసెంట్ గా వచ్చిన ఒక కామెడీ సిరీస్ తెగ నవ్విస్తోంది. ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో కూడా ఉంది. ఈ కథ రక్తం చూస్తే భయపడిపోయే ఒక డాక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇది వినడానికి కామెడీగా ఉన్నా, సినిమాలో ఆయన పడే కష్టాలు చూస్తే జాలి వేస్తుంది.
ఇది ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. దీని క్రేజ్ చూసి రెండవ సీజన్ కూడా ఖరారు చేశారు మేకర్స్. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పేరు ‘బెస్ట్ మెడిసిన్’ (Best Medicine). ఈ సిరీస్ లో డాక్టర్ మార్టిన్ బెస్ట్ పాత్రను జోష్ చార్లెస్ అద్భుతంగా చేశారు. ఆయనకి జోడీగా స్కూల్ టీచర్ లూయిసా పాత్రలో అబిగైల్ స్పెన్సర్ నటించింది. ఈ సిరీస్ 2026 జనవరిలో 6 నుంచి Hulu లో అందుబాటులో ఉంది. FOX ఛానల్‌లో ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన మరుసటి రోజే ఎపిసోడ్లు ఈ ప్లాట్‌ ఫారమ్‌లోకి వచ్చాయి. అయితే వీక్లీ ఒక ఎపిసోడ్ మాత్రమే రిలీజ్ చేశారు. 13 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఏప్రిల్ 7 న వచ్చే చివరి ఎపిసోడ్ తో ముగుస్తుంది. ఇది తక్కువ కాలంలోనే భారీ రేటింగ్స్ సంపాదించుకుంది. మార్చి 2026 నాటికి ఈ సిరీస్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది బాగా నచ్చింది. దీనికి ఉన్న క్రేజ్ చూసి, FOX నెట్‌వర్క్ అప్పుడే రెండవ సీజన్ ని కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ ను Prime Video ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో కూడా చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిటీలో ఒక పెద్ద హార్ట్ సర్జన్ డాక్టర్ మార్టిన్ బెస్ట్. అతను చేతిలో కత్తి పడితే చాలు, ఎంతటి కష్టమైన ఆపరేషన్ అయినా చిటికెలో చేసేసేవాడు. కానీ సడన్‌గా అతనికి ఒక వింత భయం పట్టుకుంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం చూస్తే చాలు, తల తిరిగి పడిపోయే పరిస్థితి. దీంతో సిటీలో ఆ పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి, ప్రశాంతంగా ఉంటుందని ఒక చిన్న పల్లెటూరికి డాక్టరుగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. ఆ ఊర్లో జనాలు అంతా పిచ్చి పిచ్చిగా, వింతగా ఉంటారు. ఈ డాక్టరేమో భయంకరమైన కోపిష్టి, ముక్కుసూటిగా మాట్లాడే టైపు. ఎవరికీ కనీసం మర్యాద ఇవ్వడు, మొహం మీదే నిజాలు చెప్పేస్తాడు.

ఆ ఊరి ప్రజలేమో ఈ డాక్టరు ఇలా ఉన్నాడేంటని తిట్టుకుంటూ ఉంటారు. కానీ లోలోపల డాక్టర్ కి అందరి మీద ఇష్టం ఉంటుంది, కాకపోతే అది బయట పెట్టడం రాదు. ఈ గొడవల మధ్యలో లూయిసా అనే ఒక స్కూల్ టీచర్ కనిపిస్తుంది. ఆమెను చూసి మన డాక్టర్ గారు ఫ్లాట్ అయిపోతాడు. కానీ ఆమెతో కూడా సరిగ్గా మాట్లాడలేక, తన యాటిట్యూడ్‌తో ఆమెను విసిగిస్తూ ఉంటాడు. ఇలా ఆ చిన్న ఊర్లో డాక్టర్ పడే తిప్పలు, తన ఫోబియాని తట్టుకుంటూ చేసే వైద్యం.. ఇవన్నీ కలిపి ఈ షోలో భలే కామెడీగా, ఎమోషనల్‌గా ఉంటాయి.

Advertisement

Read Also : కష్టాలను జయించిన ఒక పవిత్ర ఆత్మ ప్రయాణం… అవార్డులు, ప్రశంసలతో హోరెత్తిన సినిమా

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×