E-Paper
Advertisement

Horror Thriller OTT : చచ్చిన శవంలో నిద్రలేచే పిశాచి… పుట్టబోయే బిడ్డ కోసం వేట… క్షణక్షణం ఉత్కంఠ

Horror Thriller OTT : చచ్చిన శవంలో నిద్రలేచే పిశాచి… పుట్టబోయే బిడ్డ కోసం వేట… క్షణక్షణం ఉత్కంఠ
Advertisement

Horror Thriller OTT : హారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ మామూలుగా అయితే ఉండదు. ఈ సినిమాలను పగలు, రాత్రి అని తేడా లేకుండా చూసేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలను రాత్రి పూట చూస్తే ఒంట్లో వణుకు పుట్టి చలి జ్వరం వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఈ సినిమాను పూర్తిగా యూదుల జానపద కథల ఆధారంగా తీశారు. ఇందులో చూపించిన దెయ్యం పురాణాల ప్రకారం గర్భవతులను, చిన్న పిల్లలను వేధిస్తుంటుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ది ఆఫరింగ్’ (The Offering) 2022లో వచ్చిన ఒక అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా. దీనికి ఆలివర్ పార్క్ దర్శకత్వం వహించారు. ఇందులో నిక్ బ్లడ్, ఎమిలీ వైజ్‌మాన్, అలన్ కార్డనర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో తండ్రి పాత్ర వేసిన అలన్ కార్డనర్, క్షుద్రశక్తుల గురించి తెలిసిన వ్యక్తిగా నటించిన పాల్ కే తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ముఖ్యంగా యూదు సంప్రదాయాలను చాలా సహజంగా చూపించారు. ఈ సినిమా అంతా ఒకే ఇంట్లో జరుగుతుంది. ఆ ఇల్లు, అక్కడి వాతావరణం ప్రేక్షకులకు ఒక రకమైన భయాన్ని కలిగిస్తాయి. ఈ సినిమాను ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మిలీనియం మీడియా నిర్మించింది. ఈ సినిమా ప్రస్తుతం prime video లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చాలా కాలం క్రితం తన తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన ఆర్థర్, అప్పుల బాధ నుండి బయటపడటానికి ప్రెగ్నెంట్ గా ఉన్న తన గర్భవతి భార్యతో కలిసి తిరిగి ఇంటికి వస్తాడు. అతని తండ్రి ఒక యూదు సంప్రదాయంలో శవాలకు అంత్యక్రియలు చేస్తుంటాడు. ఇప్పుడు తండ్రిని ఒప్పించి ఆ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు సంపాదించాలనేది ఆర్థర్ అసలు ప్లాన్. అదే సమయంలో ఒక ముసలోడు తన పెళ్లాన్ని బతికించుకోవాలని ఒక క్షుద్ర శక్తిని (అబిజూ అనే దెయ్యం) ఒక శవంలో బంధించి చనిపోతాడు. ఆ శవం వీళ్ల ఇంటికే వస్తుంది.

ఆర్థర్ తెలియక ఆ శవం మెడలో ఉన్న తాయెత్తును పగలగొట్టడంతో, అందులో ఉన్న ఆ దెయ్యం బయటికి వస్తుంది. ఇక ఈ దెయ్యం గర్భవతులను, పుట్టబోయే బిడ్డలను లక్ష్యంగా చేసుకుంటుంది. అది ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని భయపెట్టడం మొదలుపెడుతుంది. ఆర్థర్ తండ్రి తన కొడుకును, కోడలిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ క్రమంలో అతను ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పుడు ఆ దెయ్యం చేసే బీభత్సం మామూలుగా ఉండదు. చివరికి ఆర్థర్ తన భార్యతో అక్కడి నుంచి బయట పడతాడా ? వీళ్ళు కూడా ఆ దెయ్యానికి బలి అవుతారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×