E-Paper
Advertisement

Richest IPL Cricketers: ధోని, కోహ్లీ, రోహిత్ ఎవ‌రూ కాదు..ఐపీఎల్ లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రంటే

Richest IPL Cricketers: ధోని, కోహ్లీ, రోహిత్ ఎవ‌రూ కాదు..ఐపీఎల్ లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రంటే

Richest IPL Cricketers:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్, జూన్ మొదటి వారం వరకు కొనసాగనుంది. అంటే రెండు నెలలకు పైగా ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఇప్పటికే ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన రెండు దశల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. అయితే ఈ 18 సంవత్సరాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రిచెస్ట్ క్రికెటర్ల ( Richest IPL Cricketers) లిస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇందులో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మాలను దాటేసి.. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ ( Shane Warne) మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. షేన్‌ వార్న్ ఇప్పటి వరకు రూ.460 కోట్లు ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సంపాదించాడు. దీంతో షేన్‌ వార్న్ ఆస్తుల‌ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

ఐపీఎల్ లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రంటే ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువ సంపాదించిన క్రికెటర్ గా షేన్ వార్న్ రికార్డు సృష్టించాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తాజాగా సేల్ చేశారు. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ ఆస్తులు రూ.460 కోట్లకు పెరిగాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డబ్బులు కలిగిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున 4 సీజ‌న్లు ఆడాడు షేన్ వార్న్. ఈ సంద‌ర్భంగా 4 ఏళ్ల‌లో రూ. 9.35 కోట్లు మాత్ర‌మే తీసుకున్నాడు. కానీ 3 శాతం వాటాల‌ను తెలివిగా సంపాదించే కండీష‌న్ పెట్టాడు. దీంతో అత‌ని ఆస్తులు రూ.460 కోట్లకు పెరిగాయి. ఐపీఎల్ లో రెండవ ధనిక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రూ. 230.14 కోట్ల రూపాయలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా సంపాదించాడు విరాట్ కోహ్లీ.

ప్రతి ఏడాదికి 12.8 కోట్లు యావరేజ్ గా సంపాదిస్తున్నాడు కోహ్లీ. ఇక ఐపీఎల్ చరిత్రలో మూడవ రిచెస్ట్ క్రికెటర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు రూ.212.2 కోట్లు సాధించాడు. అంటే ప్రతి సంవత్సరం యావరేజ్ గా 11.7 కోట్లు సంపాదిస్తున్నాడు రోహిత్ శర్మ. మొదట్లో డెక్కన్ చార్జెస్ తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఏడాదికి మూడు కోట్లు మాత్రమే సంపాదించాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ వాల్యూ పెరిగింది. ఇక ఐపీఎల్ లో నాలుగవ రిచెస్ట్ క్రికెటర్ గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపిఎల్ ద్వారా రూ. 192.84 కోట్లు సంపాదించాడు ధోని. యావరేజ్ గా ప్రతి సీజన్ కు 10.7 కోట్లు సంపాదిస్తున్నాడు ధోని. చివరి 4 సీజన్ లలో ఏడాదికి నాలుగు కోట్లు సంపాదిస్తున్న నేపథ్యంలో ధోని ఆస్తులు కాస్త తగ్గాయి.

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×