E-Paper
Advertisement

Smartphone Comparison: పోకో C85 vs గెలాక్సీ M17 vs మోటోరోలా G45.. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: పోకో C85 vs గెలాక్సీ M17 vs మోటోరోలా G45.. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Poco C85 vs Samsung Galaxy M17 vs Motorola G45 Comparison| షావోమీ సబ్ బ్రాండ్ పోకో కొత్తగా బడ్జెట్ 5G ఫోన్ ఇండియాలో పోకో C85 (Poco C85) 5G లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో బడ్జెట్ రేంజ్‌లో శాంసంగ్ గెలాక్సీ M17 5G, మోటోరోలా G45 5Gతో నేరుగా పోటీ పడుతోంది. మూడు ఫోన్లు కూడా 5G సపోర్ట్, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీతో వస్తున్నాయి. రూ.15 వేల లోపు మంచి వాల్యూ ఇస్తున్నాయి. మీ అవసరాలు చూసుకొని ఏది కొనుగోలు చేయాలో అని పోల్చి చూద్దాం!

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

పోకో C85 5G 4GB+128GB వేరియంట్ ధర రూ.11,999కి కాగా.. 6GB+128GB ధర రూ.12,999. ఇంతకంటే పెద్ద వేరియంట్ 8GB+128GB ధర రూ.14,499. గెలాక్సీ M17 4GB+128GB రూ.12,499కి, 6GB+128GB రూ.13,999కి, 8GB+128GB రూ.15,499కి లభిస్తుంది. మోటోరోలా G45 5G లో ఒక్క వేరియంట్ 8GB+128GB మాత్రమే ఉంది. దాని ధర రూ.11,999కి ఉంది. అంటే మోటోరోలాలో ఎక్కువ RAM తక్కువ ధరలో ఉండగా.. పోకో, శాంసంగ్‌లో వేరియంట్లు ఎక్కువ ఉన్నాయి.

డిస్‌ప్లే పోలిక

పోకో C85 5Gలో 6.9 అంగుళాల పెద్ద HD+ (720×1600) స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 810 నిట్స్ బ్రైట్‌నెస్. ఇందులో వీడియోలు, స్క్రాలింగ్ స్మూత్‌గా ఉంటుంది. గెలాక్సీ M17లో 6.7 అంగుళాల FHD+ సూపర్ ఆమోలెడ్ (1080×2340), 90Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. దీని కలర్స్ వైబ్రెంట్, షార్ప్‌నెస్ టాప్. మోటోరోలా G45లో 6.5 అంగుళాల HD+ (720×1600), 120Hz రిఫ్రెష్ రేట్.. దీని స్క్రీన్ చిన్నది కానీ స్మూత్. డిస్‌ప్లే లవర్స్‌కు శాంసంగ్ బెస్ట్.

ప్రాసెసర్ పర్‌ఫామెన్స్

పోకో C85లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300. ఈ ఫోన్ రోజువారీ టాస్కులు, లైట్ గేమింగ్ సులువుగా చేస్తుంది. గెలాక్సీ M17 5Gలో ఎక్సినోస్ 1330 చిప్ సెట్ ఉంది. ఇది మల్టీటాస్కింగ్‌లో బాగా ఉపయోగపడుతుంది. మోటోరోలా G45లో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3.. మూడింటిలో ఉండే ప్రాసెసర్లు సాధారణ ఉపయోగానికి సరిపోతాయి, కానీ బ్రాండ్ ప్రిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

బ్యాటరీ లైఫ్,  చార్జింగ్

పోకో C85లో 6000mAh భారీ బ్యాటరీ + 33W ఫాస్ట్ చార్జింగ్ + రివర్స్ చార్జింగ్ – రెండు రోజులు సులభం. గెలాక్సీ M17 5Gలో 5000mAh + 25W చార్జింగ్ – రోజు మొత్తం సరిపోతుంది. Motorola G45 5Gలో 5000mAh + 20W చార్జింగ్ – Poco కంటే తక్కువ. బ్యాటరీ ముఖ్యమైతే Poco టాప్ ఛాయిస్.

ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్

పోకో C85 ఆండ్రాయిడ్ 15 బేస్డ్ HyperOS 2.2తో వస్తుంది – 2 OS అప్‌డేట్స్ + 4 ఏళ్ల సెక్యూరిటీ. గెలాక్సీ 5G One UI 7 (ఆండ్రాయిడ్ 15) – 6 OS అప్‌డేట్స్, లాంగ్ సపోర్ట్. మోటోరోలా G45 5G ఆండ్రాయిడ్ 14తో – అప్‌డేట్స్ తక్కువ. Samsung లాంగ్ టర్మ్ యూస్‌కు బెటర్.

కెమెరా కెపాబిలిటీలు

మూటివీ 50MP ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. గెలాక్సీ M17లో OIS + అల్ట్రావైడ్ లెన్స్.. వైరస్ కెమెరా సెటప్. మోటోరోలా G45 5Gలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలకు సూపర్. పోకో C85లో 8MP సెల్ఫీ బేసిక్ కెమెరా ఉంది. కెమెరా ప్రియులకు శాంసంగ్ బెస్ట్ ఆప్షన్.

కనెక్టివిటీ పోర్ట్స్

మూటివీ 5G, USB Type-C, 3.5mm హెడ్‌ఫోన్ జ్యాక్ సపోర్ట్ చేస్తాయి. గెలాక్సీ M17లో NFC (కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్) ఉంది. పోకో, మోటోరోలాలో జ్యాక్ ఉంది. మీ అవసరాలు చూసుకోండి.

మీరు ఏది కొనుగోలు చేయాలి?

పెద్ద బ్యాటరీ కావాలంటే పోకో C85 5G. అద్భుతమైన డిస్‌ప్లే, కెమెరా, అప్‌డేట్స్ కావాలంటే గెలాక్సీ M17 5G. ఎక్కువ RAM, చిన్న సైజ్ కావాలంటే మోటోరోలా G45. మూడు ఫోన్లు కూడా మంచి వాల్యూ ఫర్ మనీ. మీ అవసరాలను చూసి కొనండి.

Also Read: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×